దేవుడికి నైవేద్యంగా చక్కెరను సమర్పిస్తే దోషమా..?

సాధారణంగా దేవాలయాలకు వెళ్లి, ఆ దేవ దేవతలకు నైవేద్యాలు సమర్పించి, తీర్థ ప్రసాదాలను పుచ్చుకోవడం ఆనాదిగా వస్తున్న ఆచారం.దేవాలయాలను సందర్శించి నప్పుడు మాత్రమే నైవేద్యాలు సమర్పించుకుండా మన ఇంట్లో చేసే పూజా కార్యక్రమాలలో కూడా ఆ దేవ దేవతలకు నైవేద్యాన్ని సమర్పిస్తారు.

 Sugar,sugar As Naivedya,temples,gods,pooja,devaotional Daily Pooja-TeluguStop.com

నిత్య పూజ అయినా లేదా ప్రత్యేక పర్వదినాలలో అయినా పూజలు నిర్వహించి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు.

పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, ఎటువంటి లోటు ఉండకూడదన్న ఉద్దేశంతో నైవేద్యాన్ని దేవునికి పెడతారు.

ఇలా దేవుని పూజించడం ద్వారా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం కలిగి ఉంటుంది.అయితే కొందరు దేవునికి పూజ చేసిన తర్వాత చక్కెర నైవేద్యంగా పెడుతుంటారు.

ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం…

దేవుడికి నైవేద్యంగా ప్రత్యేకంగా కొన్ని రకాల తీపి ఆహార పదార్థాలను తయారు చేసి సమర్పిస్తుంటారు.మరికొంతమంది దేవుడికి చక్కెరను నివేదనగా సమర్పిస్తారు.

ఇలా చక్కెరను నైవేద్యంగా సమర్పించి పూజించడం మనం చాలాచోట్ల గమనించే ఉంటాం.కానీ ఇలా చక్కెర పెట్టడం మహాపాపమని, చాలామంది చెబుతుంటారు.

అవన్నీ కేవలం అపోహ మాత్రమేనని చక్కెర నైవేద్యంగా  పెట్టడం వల్ల ఎటువంటి దోషాలు కలగకుండా ఆ దేవదేవుని అనుగ్రహం మనపై ఉంటుందని వేద పండితులు చెబుతున్నారు.

దేవుడికి నైవేద్యంగా మనం ఏ ఆహార పదార్థాలు అయితే చేసుకుంటాము వాటిని నైవేద్యంగా సమర్పించవచ్చు.

ఇవే కాకుండా మనకు తినాలనిపించినా రుచులను కూడా దేవునికి నైవేద్యంగా సమర్పించి మన కోరికలను తెలియజేయవచ్చు.కాబట్టి చక్కెరను నైవేద్యంగా సమర్పించడం వల్ల ఎటువంటి దోషం ఉండదని, మనం చేసినటువంటి ఆహారపదార్థాలను దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత మనం తీసుకోవడం వల్ల అది ప్రసాదం అవుతుంది.

కాబట్టి చక్కెర దేవుడికి నివేదనగా సమర్పించడంలో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదని పండితులు తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube