తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.మరి అలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్న వాళ్ల లో అల్లు అర్జున్ ( Allu Arjun )ఒకరు.
ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ ( Atlee Direction )లో చేస్తున్న సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయాలని చూస్తున్నాడు.
ఇక ఇతనితో పాటుగా ఆయన సందీప్ రెడ్డివంగ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అయితే వీళ్ళిద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చి ఇప్పుడు ఆ సినిమా ఉంటుందా? లేదా అనే డైలమాలో పడినట్టుగా తెలుస్తోంది.ఇప్పటివరకు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అనగానే భారీ అంచనాలైతే ఉన్నాయి.కానీ ప్రస్తుతం సందీప్ వంగ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

మరి ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన ఎలాంటి సినిమా చేస్తాడు.తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక అల్లు అర్జున్ ప్రాజెక్టు క్యాన్సిల్ అవ్వడంతోనే ఆయన రామ్ చరణ్ ప్రాజెక్టు మీద ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది.
మరి స్పిరిట్ సినిమా సక్సెస్ ను బట్టి ఆయనకు ఇతర హీరోల నుంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ లు అయితే ఉన్నాయి.ప్రస్తుతం ప్రభాస్ సైతం ఫౌజీ సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తునాటుగా తెలుస్తోంది…
.