సాధారణంగా మన హిందువుల జీవన విధానంలో ప్రకృతి ఒక భాగమైపోయింది.ఈ క్రమంలోనే ప్రకృతిని మన హిందువులు దైవ సమానంగా భావిస్తారు.
ఇలాంటి వాటిలో ఎంతో ముఖ్యం అనగా నది ఒకటి.హిందువులు గంగా నది ఎంతో పరమ పవిత్రంగా భావిస్తారు.
పురాణాల ప్రకారం గంగానదిని భువిపైకి భగీరధుడు జేష్ట మాసం శుక్లపక్ష దశమిరోజు అని తెలుస్తోంది.అదేవిధంగా గంగావతరణ జరిగినది కూడా శుక్లపక్ష దశమి రోజని పురాణాలు చెబుతున్నాయి.
మరి ఎంతో పవిత్రమైన ఈ రోజున గంగానదిలో స్నానం చేస్తే ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
మనిషి జీవితంలో తెలిసీ తెలియక ఎన్నో పాపాలు చేస్తుంటాడు.
అయితే ఆ పాపాలను తొలగించడానికి ఎంతో ముఖ్యమైన రోజు శుక్ల పక్ష దశమి.ఈరోజున గంగా జలాన్ని శివుని జటాజూటంనుండి భువికి తీసుక వచ్చారు కనుక ఈ రోజును దశపాపహర దశమిగా పేర్కొంటారు.
ఎంతో ముఖ్యమైన ఈ రోజున మన జీవితం అతిపెద్ద పాపాలను తొలగించుకునే శక్తి ఉందని హిందువులు ఎంతో ప్రగాఢంగా విశ్వసిస్తారు.మనుషులు ఎక్కువగా చేసే తప్పులు పరుషంగా మాట్లాడడం, అబద్దాలు చెప్పడం, అసంబద్ధమైన మాటలు మాట్లాడటం, సమాజం వినలేని మాటలు మాట్లాడటం ఈ విధంగా ఈ నాలుగు రకాల పాలను మనుషులు మాటల ద్వారా చేస్తారు.

అదేవిధంగా మనుషులు మానసికంగా ఎల్లప్పుడూ ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులు చేయటం, ఇతరులకు చెడు చేయాలని భావించడం, వారిది కానీ వస్తువుల పట్ల ప్రేమ కలిగి ఉండటం అనేవి మనుషులు మానసికంగా చేసే పాపాలు.అర్హత లేని వ్యక్తికి దానం చేయడం, పర స్త్రీ లేదా పురుషుడు పై అధిక వ్యామోహం కలిగి ఉండటం, హింసను చేయడం ఇవి మూడు మనిషి శరీరంతో చేసే పాపాలు.ఈ పాపాలు మొత్తం పది.ఈ విధమైనటువంటి పది పాపాల నుంచి విముక్తి పొందాలంటే తప్పనిసరిగా దశమిరోజు దశపాపహరదశమి వ్రతం ఆచరించాలి.

ఈ వ్రతంలో భాగంగా నదీ స్నానం చేయడమే ఈ వ్రతంలో ముఖ్య ఘట్టం.ఈ వ్రతం ఆచరించేవారు నదీ స్నానం చేసి ముఖ్యంగా గంగా నది స్నానం చేయడం ఎంతో ముఖ్యం.ఈ విధంగా నదీస్నానమాచరించి దేవుని ప్రతిమ నందు గాని లేదా కలశం నందు గాని గంగాదేవినిl ఆవాహనం చేసుకొని పూజ చేయాలి.తెల్లని పువ్వులను వస్త్రాలను గంగా దేవికి సమర్పించి గంగా స్తోత్రం పఠించాలి.
ఆ తర్వాత విష్ణువుని గాని శివుడిని పూజించడం వల్ల మనం చేసిన పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.