వాస్తు శాస్త్రం( Vastu Shastram ) ప్రకారం అనుసరిస్తే చాలా సమస్యల నుండి బయటపడవచ్చు అని మనం వేద పండితులు చెబుతున్నారు.చాలామంది రోజూ పూజలు చేస్తూ ఉంటారు.
అయితే పూజ చేయడానికి ముందు దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటారు.అయితే దీపం వెలిగించేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
అయితే ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతిరోజు పూజ చేసే సమయంలో దీపాన్ని వెలిగించితే ఆనందం కలుగుతుంది.
అదేవిధంగా ఆనందంగా కూడా ఉండవచ్చు.దీపం వెలిగించే సమయంలో కుందులు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి.
కుందులు శుభ్రంగా లేకపోతే వాటిని తోమి వెలిగించాలి.ఎందుకంటే మంచి కుందుల్లో దీపం వెలిగించకపోతే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.
అందుకే కుందులను శుభ్రంగా కడిగి దీపాన్ని వెలిగిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.ఇంటిని శుభ్రంగా చేసిన తర్వాత మాత్రమే పూజ చేయాలి.
అదే విధంగా ఇంటిని శుభ్రం( Clean the house ) చేసిన తర్వాతే దీపాన్ని వెలిగించడం లాంటివి చేయాలి.
ఆ తర్వాత దీపాన్ని వెలిగిస్తే ఎంతో మంచి కలుగుతుంది.
ఇక మీ ఇంటి ముఖద్వారం( front door ) దగ్గర కూడా సాయంత్రం పూట దీపాన్ని వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది.ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ( Goddess Lakshmi )మీ ఇంటికి వస్తుంది.
అంతే కాకుండా మీరు ఆయురారోగ్యాలతో ఉండవచ్చు.ఇలా చేయడం వలన ప్రశాంతత కూడా ఉంటుంది.
అంతేకాకుండా దీపాన్ని వెలిగించేటప్పుడు దీపం కుందుల కింద చిన్న ప్లేట్లు ఉండేలా చూసుకోవాలి.
ఎందుకంటే డైరెక్ట్ గా కుందులను నేల మీద పడడం పెట్టడం మంచిది కాదు.అందుకే ప్లేట్ ని కానీ తమలపాకులు కానీ తీసుకొని ఉపయోగించాలి.ఇలా పండితులు చెప్పినట్లు అనుసరిస్తే ఖచ్చితంగా సమస్యలు అన్నిటిని పరిష్కరించుకోవచ్చు.
అందుకే పండితులు అనుసరించి దీపాన్ని వెలిగిస్తే చక్కటి పాజిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి వస్తుంది.అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉండవచ్చు.