మీ దంతాల ఆకృతి.. మీ భవిష్యత్తు గురించి ఏం చెబుతుందో తెలుసుకోండి..?

దంతాలు( Teeth ) మనిషి ముఖానికి అందాన్ని ఇవ్వడమే కాకుండా మనిషి ఆహారం తినడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.దంతాల ఆకృతి కూడా మనుషుల వ్యక్తిత్వాన్ని( Personality ) తెలియజేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

 Know Your Personality By Shape Of Your Teeth Details, Teeth, Teeth Shape, Person-TeluguStop.com

ప్రపంచంలో ప్రతి ఒక్కరి ముఖ కవలికలు భిన్నంగా ఉంటాయి.ఇద్దరు వ్యక్తుల ముఖాల్లో కొన్ని పోలికలు కలుస్తాయేమో కానీ అచ్చు గుద్దినట్లు అస్సలు ఉండరు.

ఐడెంటికల్ కవలలు అయితే అచ్చుగుద్దినట్టు ఉంటారు.సముద్రిక శాస్త్రాన్ని అనుసరించి వ్యక్తుల దంతాల ఆకృతిని బట్టి వారి వ్యక్తిత్వాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

సాముద్రిక శాస్త్రన్ని( Samudrika Shastra ) అనుసరించి తెల్లగా అందమైన దంతాలు ఉన్నవారు అదృష్టవంతులు అని చెబుతున్నారు.ఈ వ్యక్తుల స్వభావం స్నేహశీలమైనదిగా, ఉల్లాసంగా ఉంటుంది.అందరితో సామరస్యంగా జీవిస్తారు.వీరినీ పోరాట పటిమ కలిగిన వారిగా చెప్పవచ్చు.

దంతాల చిగుళ్ళు మందంగా బలంగా కనిపించే వ్యక్తి కాస్త అహంకారంతో ఉండే అవకాశం ఉంటుంది.చిగుళ్ళు గులాబీ రంగులో ఉన్న వ్యక్తులు మర్యాద కలిగి ఉంటారు.

వీరికి ఆయుష్షు కూడా ఎక్కువే.

Telugu Characters, Lakshmi Devi, Personality, Teeth, Teeth Shape-Latest News - T

పసుపు పచ్చ రంగులో దంతాలు ఉండేవారు చాలా నమ్మకమైన వ్యక్తులు. వీరిని సులభంగా నమ్మవచ్చు.స్నేహ పూరిత మన స్వతం కలిగి ఉంటారు.

అలాగే వంకర టింకరగా, ఎగుడు దిగుడు దంతాలు ఉన్నవారు జీవితంలో కొన్ని అవకాశాలను కోల్పోతారని చెబుతున్నారు.సాముద్రిక శాస్త్రం ప్రకారం దంతాలు సమంగా పైకి లేచినట్లు ఉండే సరళరేఖలో మృదువుగా అమర్చినట్లు ఉన్న వ్యక్తికి జీవితంలో డబ్బుకు లోటు ఉండదు.

లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ వీరి వెంట ఉంటాయి.

Telugu Characters, Lakshmi Devi, Personality, Teeth, Teeth Shape-Latest News - T

ముఖ్యంగా చెప్పాలంటే దంతాల మధ్య అంతరం ఉన్న వ్యక్తులు తెలివైన వారై ఉంటారు.ఈ వ్యక్తులు ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి పని చేయించుకోవడంలో నైపుణ్యం కలిగి ఉంటారు.వీరు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గని మనస్వతం కలిగి ఉంటారు.

వీరి వ్యక్తిత్వం ప్రభావం వీరితో ఉండే వారి మీద తప్పకుండా ఉంటుంది.ఓపెన్ మైండెడ్ గా వీరు ఉంటారు.

తినడం, తాగడం ఎప్పుడూ పార్టీ మూడ్ లో ఉంటారు.కెరీర్ లో చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారు.

అంతేకాకుండా వారి నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి.పొడవైన దంతాలు ఉన్నవారు చాలా అనుభవజ్ఞులు, ధైర్యవంతులని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube