సాధారణంగా దేవాలయాలను దర్శించినప్పుడు మానసికంగా చాలా ప్రశాంతత కలుగుతుంది.దేవాలయం లో దేవుని దర్శనం అయ్యాక శరీరం,మనస్సు రెండూ ఉత్తేజితమవుతాయి.

దానికి కారణం అక్కడి భగవంతుని మహిమా, మంత్రోచ్చారణలు మాత్రమే కాదు.ప్రత్యేకమైన మన ఆలయ నిర్మాణ శైలి కూడా ప్రధాన కారణం అని చెప్పవచ్చు.దేవాలయాలు శక్తి కేంద్రకాలు.మంత్రోచ్ఛారణాల్లోని శబ్దతరంగాల వల్ల మనసు చెడు ఆలోచనల వైపు మరలదు.సరైన నిర్ణయాలు తీసుకోవటంలో సహాయపడుతుంది.ఆధ్యాత్మికంగా ఆత్మానందాన్ని కలిగించే వాతావరణం ఉన్న గుడిలో , దైవ సన్నిధిలో ధ్యానం గానీ జపం గానీ చేయడం వలన జ్ఞాపక శక్తి మెరుగు అవ్వటం వలన రెట్టింపు ఫలితాలను సాధించవచ్చు.
సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను సాధించవచ్చు .అందుకే దేవాలయాలలో భగవంతుని దర్శనం తరువాత కాసేపు ఆ ఆవరణలోప్రశాంతంగా కూర్చోవాలి.