ఒకప్పుడు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తరువాత అవకాశాలు లేక ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు అందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయ కూడా ఒకరు.ఈమె చేసిన సినిమాలు చాలా సక్సెస్ లు సాధించాయి.
బాలనటిగా పలు సినిమాల్లో నటించిన లయ( Laya ) ఆ తర్వాత స్వయంవరం సినిమాతో ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమై తొలి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి, ఒకే ఏడాది లో పది సినిమాల్లో నటించిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి.
కెరీర్ అంత పీక్ రేంజ్ లో కొనసాగుతున్న సమయం లో ఆమె గణేష్ గోత్రి( Ganesh Gotri ) అనే అతనిని పెళ్ళాడి సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది.అయితే ఆ తర్వాత చాలా కాలానికి ఆమె రవితేజ – శ్రీను వైట్ల ( Ravi Teja – Srinu vaitla )కాంబినేషన్ లో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.
ఆ తర్వాత ఆమె మళ్ళీ మీడియా కి కూడా కనపడలేదు.

ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆమె మీడియా ముందుకి వచ్చి పలు ఇంటర్వ్యూస్ ఇచ్చింది.ఈ ఇంటర్వ్యూస్ లో ఆమె మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.లయ భర్త గణేష్ పెద్ద పారిశ్రామిక వేత్త అని, అతనికి ఉన్న ఆస్తులు వేల కోట్ల రూపాయిల్లోనే ఉంటుందని, ఇలా యూట్యూబ్ , సోషల్ మీడియా లో పలు కథనాలు ప్రచారం అయ్యాయి.
ఇదే సమయంలో అమెరికాలో తను చేసే జాబ్, శాలరీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.తాను 2006లో పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిన లయ.2011 నుంచి ఐటీ సెక్టార్‌లో జాబ్ చేసినట్లు చెప్పింది.నాలుగేళ్లు ఫుల్ టైం వర్క్ చేశానని, ఇండియాలోని ప్రముఖ ఐటీ సంస్థకు చేసినట్లు తెలిపింది.

ఆ సమయంలో తన శాలరీ అన్ని ట్యాక్స్‌లు పోనూ 12000 డాలర్స్ అని చెప్పింది.అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు నెలకు పది లక్షలు .నాలుగేళ్లు ఐటీ సెక్టార్ లో తాను 2017లో జాబ్ వదిలేసానంది.ఆ తర్వాత డాన్స్ స్కూల్ పెట్టానని, కోవిడ్ కారణంగా అది మానేసి సోషల్ మీడియాలో రీల్స్ చేయడం స్టార్ట్ చేశానంటూ చెప్పుకొచ్చింది.
ఇక చాలా ఏళ్ల తర్వాత ఇండియా వచ్చిన లయ హైదరాబాద్ చాలా మారిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.న్యూయార్క్ సిటీ కంటే హైదరాబాదే చాలా బాగుందని వ్యాఖ్యానించింది.
ఇక ఇటీవల లయ చేసిన పలు ఇంటర్వూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి…
.