2020 లో ఎన్నో వింతలు జరిగాయి.ఎట్ ది సేమ్ టైం సెలెబ్రటీస్ మీద కూడా ఎన్నో ట్రోల్స్ జరిగాయి.
అసలు ఈ సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత కొంతమంది నెటిజనులకు బాగా పని పెరిగిపోయింది.ఎప్పుడు ఎవరు ఎక్కడ దొరుకుతారా ఎలా ట్రోల్ చేద్దామా అన్నట్టే చూస్తున్నారు.
మరి ముఖ్యంగా ఈ సంవత్సరం టాప్ హీరోయిన్స్ మీద ఎన్నో ట్రోల్స్ జరిగాయి.సో, ఆ హీరోయిన్స్ ఎవరు వాళ్ళని ఎందుకు ట్రోల్ చేసారు లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఈలిస్ట్ లో ముందుగా పూజ హేగ్దే గురించి మాట్లాడుకోవాలి.ఈమె డైరెక్టుగా సమంతానే టార్గెట్ చేసినట్టు మాట్లాడింది.అసలేం జరిగిందంటే పూజ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో సమంత ఫోటోని ట్యాగ్ చేస్తూ.”I don’t find her pretty at all” అని పోస్ట్ పెట్టింది.అంటే సమంత నాకేం అంత పెద్ద అందగత్తెగా కనపడట్లేదని దానర్ధం.ఇక చూస్కోండి రచ్చ మొదలైంది.ఏంటి మా సమంతాని అంత మాట అంటావా అంటూ సమంత ఫాన్స్ ట్విట్టర్ లో కామెంట్లు పెట్టి పూజని ఎత్తిపొడిచారు.ఇంకా సమంతాకి బాగా క్లోజ్ అయిన నందిని రెడ్డి, చిన్మయి లాంటి సెలబ్రిటీస్ కూడా సమంతని సపోర్ట్ చేస్తూ పూజని ట్విట్టర్ లో ఏకిపారేశారు.
సమంత కూడా దీనిపై స్పందించింది.పూజ హేగ్దే క్షమాపణ చెప్పాలని సోషల్ మీడియాలో పెద్ద గొడవే చేసారు.
దానికి పూజా నా ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పి చేతులు దులుపుకుంది.ఏదిఏమైనా ఈ వార్ నెటిజనులకు ట్రోల్ చేసుకోవడానికి మాత్రం బాగా ఉపయోగపడింది.

ఇక ఆతర్వాత ట్రోల్ అయిన లిస్ట్ లో రాసి ఖన్నా ఉంది.ఈమె వరల్డ్ ఫ్యాన్స్ లవర్ సినిమా చేసిన తర్వాత ఈ సినిమాలో నేను చేసిన యామిని రోల్ చాల టఫ్ అని చెప్తూనే.ఈ సినిమాలో అనోవసరంగా నటించానని ఈసారి ఏదైనా సినిమా ఓకే చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటు చెప్పింది.ఇక అంతే ట్రోలర్స్ ఏంటేంటి.ఈ సినిమాలో నటించినందుకు సిగ్గు పడుతున్నావా అంటూ.ట్రోలింగ్ స్టార్ట్ చేసారు.
ఆ ట్రోలింగ్ భరించలేక రాసి ఖన్నా దీనిపై మళ్ళీ స్పందించింది.అయ్యయ్యో నా ఉద్దేశం అది కాదని.
ప్రతి ఒక్క సినిమా ఒక అనుభవమని ఒక నటిగా ప్రతి సినిమాకి నేను ఏదో ఒకటి నేర్చుకుంటానని ఆ ఉద్దేశంతో నేను I regret doing WFL, I should be more careful about the type of roles I do from now on.అని అన్నానని క్లారిటీ ఇచ్చింది.అంతేకాదు నేను భవిష్యత్తులో పాలిటిక్స్ లోకి వస్తా అని కూడా ఇంకొక పోస్ట్ పెట్టింది.ఈపోస్ట్ వలన కూడా ట్రోల్ కి గురైంది.

ఇక ఈ లిస్ట్ లో రీసెంట్ టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక కూడా చేరిపోయింది.ఈమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ “వి ఈట్ పిగ్ మీట్” అని రాసింది.ఇక అంతే ఏంటి నువ్వు పంది మాంసం తింటావా అంటూ మన ట్రోలర్స్ అండ్ మీమర్స్ రెచ్చిపోయారు.

ఇక సాయి పల్లవి కూడా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తెలుగు సినిమా షూటింగ్ లో హీరోకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు హీరోయిన్స్ ని పట్టించుకోరు.అదే మలయాళం లో అయితే హీరో అండ్ హీరోయిన్ ఇద్దరిని ఒకే రకంగా చూస్తారు అని చెప్పింది.ఈ ఒక్క మాటకి సాయి పల్లవిని ఫుల్ గా ట్రోలింగ్ చేస్తారేమో అని అనుకుంటే అసలు ఎవరు పట్టించుకోలేదు.
మే బి ఆమె చెప్పింది నిజమే అని అనుకున్నారో ఏమో.అందులోని న్యాచురల్ బ్యూటీ కదా!

ఇక ఈ లిస్ట్ లో బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కూడా వున్నారు.ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే ముందు సోషల్ మీడియా ద్వారా స్పందించేది కంగనా మాత్రమే.ఎంతపెద్దవాళ్లు తప్పు చేసిన వారిని ప్రశ్నించడానికి భయపడదు.
సో, ట్రోలర్స్ కి ఎక్కువసార్లు స్టఫ్ ఇచ్చే హీరోయిన్ కూడా బహుశా కంగనానేమో!
.