పండుగలు లేదా ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో ఉపవాసం( Fasting ) చేయడం చాలా మందికి ఉన్న అలవాటు.ముఖ్యంగా ఆడవారు ఉపవాస దీక్ష ఎక్కువగా చేపడుతూ ఉంటారు.
కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఉపవాసాలు చేస్తూ పూజలు పురస్కారాల్లో మునిగిపోతుంటారు.అలాగే ఇటీవల కాలంలో వెయిట్ లాస్( Weight Loss ) అవ్వడం కోసం కూడా చాలా మంది ఫాస్టింగ్ ను ఎంచుకుంటున్నారు.
ఫాస్టింగ్ లో ఎన్నో రకాలు ఉంటాయి.కొందరు ఉపవాసం రోజు లిక్విడ్స్ తీసుకుంటూ సాలిడ్స్ దూరం పెడుతుంటారు.

ఇంకొందరు లిక్విడ్స్, సాలిడ్స్.రెండిటినీ ఎవైడ్ చేస్తారు.మరికొందరు డే మొత్తం ఏం తినకుండా ఉండి.నైట్ లైట్ ఫుడ్ తీసుకుంటారు.ఎవరికి నచ్చినట్లు వారు ఉపవాసం చేస్తుంటాయి.అయితే ఆరోగ్య పరంగా ఉపవాసం చేయడం చాలా మంచిది.
వారంలో ఒక రోజు ఉపవాసం చేయడం వల్ల బోలెడు లాభాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు.

వారానికి ఒక రోజు ఉపవాసం చేయడం వల్ల ఒంట్లో ఇన్సులిన్ ను( Insulin ) గ్రహించే స్వభావం మెరుగుపడుతుంది.రక్తంలో గ్లూకోజ్ నిల్వలపై నియంత్రణ పెరుగుతుంది.అలాగే ఉపవాసం ఆటోఫాగీని ప్రేరేపిస్తుంది.
కణాల నుండి పాత మరియు దెబ్బతిన్న ప్రోటీన్లను తొలగించే ప్రక్రియనే ఆటోఫాగీ( Autophagy ) అంటారు.వారానికి ఒక రోజు ఫాస్టింగ్ చేస్తే మీ మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది.
ఏకాగ్రత పెరుగుతుంది.
ఉపవాసం గుండె జబ్బులకు ప్రమాద కారకాలైన చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది.
గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది.బరువు తగ్గాలని భావిస్తున్నవారు వారానికి ఒక రోజు ఉపవాసం చేయడం అలవాటు చేసుకోండి.
తద్వారా ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కడగడం ప్రారంభం అవుతుంది.అంతేకాదు, ఫాస్టింగ్ వల్ల ఆకలిపై నియంత్రణ లభిస్తుంది.
అధిక రక్తపోటు సమస్య దూరం అవుతుంది.ఒత్తిడి, వ్యాధులను తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.
గాయాలు ఏమైనా ఉన్నా కూడా త్వరగా నయం అవుతాయి.