కోలీవుడ్ లోనే మోస్ట్ కాంట్రవర్షియల్ క్వీన్ వనితా విజయ్ కుమార్( Vanitha Vijay Kumar ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.విజయ్ కుమార్ మరియు మంజుల ల గారాల పత్రిక వనితకు మొదటి నుంచి వివాదాలు అలవాటే.
ఆమె చేసుకున్న పెళ్లిళ్లు, పుట్టిన పిల్లలు మరియు వ్యక్తిగత జీవితం ఎప్పుడూ సంచలనాలకు అడ్రస్ గానే ఉంటుంది.వనిత ఇద్దరు భర్తల ద్వారా ముగ్గురు పిల్లలకు జన్మనివ్వగా ఆమె మొదటి సంతానం కుమారుడు.
అతడు త్వరలోనే తమిళనాట హీరో గా డెబ్యూ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.అతనికి విజయ్ కుమార్ సపోర్ట్ గట్టిగానే ఉంది.
చిన్నతనంలోనే వనిత నుంచి తన కుమారున్ని వేరు చేసి విజయ కుమార్ పెంచడం విశేషం.ఇక ఇద్దరు కూతుర్ల సంరక్షణ మాత్రమే వనిత దగ్గరుండి చూసుకుంటుంది.
వనిత పెద్ద కుమార్తె జోవిక( Jovica ) విజయ్ కుమార్ ప్రస్తుతం 18 ఏళ్ల ప్రాయంలో ఉండగా ఆమె బిగ్ బాస్ 7 తమిళ్( Tamil ) లో ప్రవేశించడం ప్రస్తుతం సంచలనంగా మారింది.గతంలో వనిత సైతం బిగ్ బాస్ హౌస్ లో ఒక సీజన్లో పాల్గొంది ప్రస్తుతం తల్లి వారసత్వాన్ని కుమార్తె కూడా అందిపుచ్చుకుంది.ఆమె కూడా తన తల్లి, అమ్మమ్మల గొప్ప నటి అవ్వాలని కోరుకుంటుంది.జ్యోతిక బిగ్ బాస్ లో ప్రస్తుతం సంచలనంగా మారింది తన తల్లి గురించి తండ్రి గురించి వ్యాఖ్యానాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
అంత పెద్ద నటీమణుల కుటుంబంలో పుట్టినా కూడా జోవిక ఇలా బిగ్ బాస్ హౌస్ ఎంచుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
అయితే మంజుల కుమార్తెలందరూ కూడా హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో రాణించారు వారి తరహాలోనే మూడవ జనరేషన్ అయినా జోవిక సైతం హీరోయిన్ గా రాణించాలనుకుంటుంది.పైగా అందం విషయంలో కూడా ఆమె తన అమ్మమ్మ ను మించిపోయెలా కనిపిస్తుంది.మరి బిగ్బాస్ హౌస్ కప్ గెలుచుకొని బయటకు వస్తుందా ? మధ్యలోనే ఇంటిమోహం పడుతుందో తెలియదు కానీ బయటకు వచ్చాకా ఎలా తనను తాను హీరోయిన్ గా సిద్ధం చేసుకుంటుందో మరి కొన్ని రోజులు ఆగితేనే తెలుస్తుంది.