దేశంలో చాలామంది తల్లీదండ్రుల కలను నెరవేర్చడం కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు.కొంతమంది తల్లీదండ్రుల కలను నిజం చేసి ప్రశంసలు అందుకుంటూ ఉంటారు.
ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన గ్రూప్1 ఫలితాలలో సత్యసాయి జిల్లా మర్రికొమ్మ దిన్నె గ్రామానికి చెందిన జ్ఞానానందరెడ్డి ( Gnanananda Reddy )సత్తా చాటడంతో పాటు ప్రశంసలు అందుకుంటున్నారు.తన సక్సెస్ ను నాన్నకు అంకితం చేస్తున్నానని జ్ఞానానందరెడ్డి తెలిపారు.
నాన్న వీఆర్వోగా పని చేస్తున్న సమయంలో గ్రూప్1 సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నానని అమ్మ అరుణ కుమారి అంగన్ వాడీ టీచర్ గా పని చేస్తున్నారని ఆయన తెలిపారు.గ్రూప్1 అధికారి కావాలనే నాన్న కల నన్ను ఇంతవరకు నడిపించాయని జ్ఞానానందరెడ్డి చెప్పుకొచ్చారు.కానీ గ్రూప్1 సాధించే సమయానికి నాన్న మరణించారని ఆయన తెలిపారు.నా భార్య రవళి గ్రూప్1 కు ప్రిపేర్ అవుతున్నారని జ్ఞానానందరెడ్డి పేర్కొన్నారు.
ఎస్కే యూనివర్సిటీలో( SK University ) రూరల్ డెవలప్మెంట్ విభాగంలో పీహెచ్డీ అడ్మిషన్ పొందడం నా లైఫ్ లో మలుపు లాంటిదని ఆయన కామెంట్లు చేశారు.అక్కడ పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులు నాకు స్పూర్తి అని జ్ఞానానందరెడ్డి అన్నారు.ప్రస్తుతం రైల్వే సూపరిండెంట్ గా జాబ్ చేస్తున్నానని గతంలో రైల్వే క్లర్క్ జాబ్ వచ్చిందని జ్ఞానానందరెడ్డి వెల్లడించిన విషయాలు వైరల్ అవుతున్నాయి.
జ్ఞానానందరెడ్డి సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుంది.
జ్ఞానానందరెడ్డి కెరీర్ పరంగా మరింత విజయం సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.జ్ఞానానందరెడ్డి బాల్యం నుంచి ఎంతో కష్టపడేవారని సమాచారం అందుతోంది.
ఎంతో కష్టపడి ప్రతిభకు తగ్గ ఉద్యోగం సాధించిన జ్ఞానానందరెడ్డి సక్సెస్ విషయంలో మర్రికొమ్మ దిన్నె గ్రామస్తులు ఎంతగానో సంతోషిస్తున్నారు.జ్ఞానానందరెడ్డి టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని చెప్పవచ్చు.