కజకిస్తాన్‌లో ఇండియన్ టూరిస్ట్‌కి షాక్.. రూ.170 రైడ్‌కి రూ.5,000 కాజేసిన టాక్సీ డ్రైవర్..

కజకిస్తాన్‌లో( Kazakhstan ) చాలా అందమైన నగరాలున్నాయి.అక్కడ చాలా పాత కట్టడాలు, ప్రాచీన నాగరికతల ఆనవాళ్లు ఉన్నాయి.

 Indian Tourist Scammed By Local Taxi Driver In Kazakhstan Details, Kazakhstan, C-TeluguStop.com

ఈ కారణంగా భారతీయులు అక్కడికి చాలా ఎక్కువగా వెళ్తున్నారు.ఇది విదేశాలకు తక్కువ ఖర్చుతో వెళ్లాలనుకునే వారికి చాలా బాగుంటుంది.

ఇండియన్ పాస్‌పోర్ట్ ఉన్న వారు కజకిస్తాన్‌లో వీసా లేకుండా రెండు వారాలు ఉండవచ్చు.కానీ ఇక్కడ అంత సేఫ్ కాదని వెలుగులోకి వస్తున్న కొన్ని సంఘటన ప్రకారం తెలుస్తోంది.

తాజాగా కొమల్ మహేశ్వరి( Komal Maheshwari ) అనే ఒక ఇండియన్ ట్రావెల్ వ్లాగర్( Indian Travel Vlogger ) కజకిస్తాన్‌కు వెళ్లి దారుణంగా మోసపోయింది.ఆ చేదు అనుభవం గురించి సోషల్ మీడియాలో పంచుకుంది.

ఆమె ఇక్కడ ఒక పెద్ద మోసం జరిగిందని చెప్పింది.విమానాశ్రయం నుంచి హోటల్‌కు వెళ్లడానికి ఆమె రూ.5,000 కంటే ఎక్కువ చెల్లించవలసి వచ్చిందని చెప్పింది.ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు వీడియోలు పోస్ట్ చేసింది.

మొదటి వీడియోలో, తాను తన ఫ్రెండ్ తో కలిసి అర్ధరాత్రి కజకిస్తాన్‌ విమానాశ్రయానికి చేరుకున్నారని తెలిపింది.లోకల్ సిమ్ కార్డ్ లేకపోవడంతో, వారు ట్యాక్సీ బుక్ చేసుకోవలసి వచ్చింది.

అయితే, ఒక ట్యాక్సీ డ్రైవర్( Taxi Driver ) వారికి లిఫ్ట్ ఇచ్చాడు.

“నేను ఒంటరిగా ప్రయాణం చేస్తుంటే, డే టైమ్‌లో వచ్చే ఫ్లైట్‌ను బుక్ చేసుకుని, కారును ముందుగానే బుక్ చేసుకునేదాన్ని.నాకు ఇలాంటి మోసం జరుగుతుందని అనుకోలేదు” అని కొమల్ తన సోషల్ మీడియా పోస్టులో రాసింది.రెండవ వీడియోలో, కొమల్ హోటల్ చేరుకున్న తర్వాత ట్యాక్సీ డ్రైవర్ 77,000 టెంజ్ (సుమారు రూ.13,000) ఇవ్వమని డిమాండ్ చేశాడని చెప్పింది.మొదట, ఆ డ్రైవర్ కేవలం 1,000 టెంజ్ (సుమారు రూ.170) అవుతుందని చెప్పాడు.

వారు ఇవ్వడానికి నిరాకరించినప్పుడు, డ్రైవర్ కోపంతో ఒక రౌడీలాగా బిహేవ్ చేశాడని కొమల్ చెప్పింది.కొమల్, ఆమె స్నేహితుడు చర్చించి చివరకు ఆ రైడ్‌కు 30,000 టెంజ్ (సుమారు రూ.5,500) చెల్లించారు.“మీటర్‌ స్కామ్‌లు జరుగుతాయని నాకు తెలుసు, కానీ ఇది ఇంత ప్రమాదకరంగా మారుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.ఈ అనుభవం నాకు ఒక పాఠం నేర్పించింది.

ఇతరులు కూడా నాలాంటి తప్పులు చేయకుండా ఉండాలని నేను ఈ విషయాన్ని పంచుకుంటున్నాను” అని కొమల్ చెప్పింది.

కొమల్ వీడియోలు చాలా వైరల్ అయ్యాయి.

ఒక యూజర్ “విదేశాలకు వెళ్లే ముందు స్థానిక స్నేహితుడిని కనుక్కోవడం మంచిది” అని సూచించారు.మరొక వ్యూవర్ “ప్రతి దేశంలో ఇలాంటివి జరుగుతాయి.

అమాయకంగా కనిపించే పర్యాటకుడిని చూస్తే, వారు ఏ ధర అయినా చెప్పవచ్చు” అని వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube