కళ్ళ కింద వలయాలు ఇలా తొలగించండి

ముఖం కడిగేసుకొని అద్దంలో మనల్ని మనం చూసుకుంటే, మహేష్ బాబు కన్నా మనం ఏం తక్కువ అనే ఫీలింగ్ అబ్బాయిలకి, కాజల్ నాకంటే అందంగా ఉందా అనే ఫీలింగ్ అమ్మాయిలకి కలగడం చాలా సహజం.అదే ముఖాన్ని ఓ గంట తరువాత చూసుకుంటే అదే మాట మీద ఉండటం చాలా కష్టమైన విషయమే.

 Coffee Will Treat Dark Circles Effectively-TeluguStop.com

అదే ముఖాన్ని ఓ పది గంటల తరువాత చూసుకుంటే ఇది నేనేనా అని అనుకుంటాం కూడా.అంతలా మారిపోతుంది.

దానికి కారణాలు చాలానే ఉన్నాయి.కాని అతిపెద్ద కారణం పని ఒత్తిడి.

రెండో కారణం నిద్రలేమి.ఈ రెండు సమస్యల వలన ఏర్పడే సమస్య కళ్ళ కింద వలయాలు.

ఈ వలయాలు ముఖాన్ని చాలా దెబ్బతీస్తాయి.మేకప్ తీసేయ్యగానే హీరోయిన్ మనలాగే ఎందుకు కనబడుతుంది ? కళ్ళ కింద వలయాలు కనబడతాయి గనుక.అంతలా మన అందాన్ని ప్రభావితం చేస్తాయి ఇవి.వీటిని పోగొట్టుకునే సులువైన పధ్ధతి ఒకటి ఉంది చదివెయ్యండి.

పొద్దున్న లేస్తేనే కాఫీ తాగాలి అంటారు కదా.అందులో ఉండే కెఫైన్ మీ బడిలో లోపలే కాదు, చర్మపైన కూడా మేలు చేస్తుంది .కాఫీ బీన్స్ తీసుకోని , దాంట్లో కొంచెం కొబ్బరినునే కలుపుకొని కళ్ళ కింద ఉన్న వలయాల మీద రాయండి.ఓ 20 నిమిషాలపాటు దాన్ని అలానే ఉంచి కడిగెయ్యండి.

ఫలితం మీ కళ్ళ ముందే ఉంటుంది.ఇలా రోజూ చేస్తే, ఆ వలయాలను తొలగించడం పెద్ద కష్టమైనా పనేం కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube