ప్రెగ్నెన్సీ సమయంలో పుట్టగొడుగులు తినడం మంచిదా.. కాదా..

మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో మంచి మంచి ఆహారం తీసుకోవడం అనేది తల్లికి పుట్టబోయే బిడ్డకు కూడా ఎంతో మంచిది.మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో పోషకమైన ఆహారం తీసుకోవడం ఇద్దరికీ మంచిది.

 Is It Good To Eat Mushrooms During Pregnancy.. Or Not , Eat Mushrooms,mushrooms-TeluguStop.com

కాబట్టి వీరు ఎక్కువగా పౌష్టిక ఆహారం, పానీయాలు తీసుకోవడం మంచిది.అయితే పోషకలు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులు ప్రెగ్నెంట్ మహిళలు తినవచ్చా, తింటే మంచిదా, కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

ఆరోగ్యా నిపుణులు దీని గురించి ఏమి చెబుతున్నారంటే, పుట్టగొడుగుల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.గర్భిణీ మహిళలు వీటిని ఆహారంగా తీసుకుంటే ఇమ్యూనిటీ శక్తి పెరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు.

రోగనిరొక శక్తిని పెంచడంలో పుట్టగొడుగులు ఎంతో ఉపయోగపడతాయి.పుట్టగొడుగులను ఆహారంలో తీసుకోవడం వల్ల ఎంతో మంచిది.

అయితే ఇవి తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం ఎంతో అవసరం.మార్కెట్లో ఎన్నో రకాల పుట్టగొడుగులు అందుబాటులో ఉన్నాయి.

వీటిలో పారాసోల్ పుట్టగొడుగులు లాంటి పుట్టగొడుగులను మాత్రం అస్సలు తినడానికి ఉపయోగించకూడదు.పుట్టగొడుగులను ఎప్పుడూ పరిమితం మోతాదు లో మాత్రమే తినడం ఎంతో మంచిది.

పుట్టగొడుగులను నీళ్లతో బాగా శుభ్రం చేసి ఉడికించి తినడం ఎంతో మంచిది.వీటిని పచ్చిగా అసలు తినకూడదు.

పుట్టగొడుగులను తాజాగా ఉన్నప్పుడు మాత్రమే తినడం కూడా మంచిది.నిల్వ ఉన్న వాటిల్లో పురుగులు ఉండే అవకాశం ఉంది.

పుట్ట గొడుగులను తినాలనుకున్నప్పుడు ఒకసారి వైద్యులను సంప్రదించడం మర్చిపోకూడదు.గర్భిణీ స్త్రీలు ఎక్కువగా డాక్టర్ సలహా మేరకే ఏ ఆహార పదార్థాలు అయినా తినడం మంచిది.ఇలా సలహాలు పటిచడం వల్ల గర్భిణీ స్త్రీల ఆరోగ్యం మరింత మంచిగా ఉంటుంది.ఇవి తిన్న తర్వాత ఏదైనా సమస్య వస్తే తినడం ఆపివేసి వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube