స్లీపింగ్ పిల్స్ వాడటం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్

నిద్ర పట్టని వారు నిద్ర మాత్రలను వేసుకుంటూ ఉంటారు.ఈ మధ్య కాలంలో నిద్ర సమస్య అనేది ఒక పెద్ద అనారోగ్య సమస్యగా మారింది.

 Sleeping Pills Side Effects , Sleeping Pills , Side Effects, Immunity, Semi Co-TeluguStop.com

శరీరానికి నిద్ర కారణముగా విశ్రాంతి లభిస్తుంది.అయితే బిజీ జీవనశైలి,ఒత్తిడి వంటి కారణాలతో నిద్ర రావటం అనేది కష్టంగా మారిపోయింది.

కొంతమంది నిద్ర మాత్రలు వాడుతూ ఉన్నప్పుడు అవి అలవాటు అయ్యిపోయి నిద్ర మాత్రలు వేసుకుంటేనే నిద్ర వచ్చే పరిస్థితికి దారితీస్తుంది.నిద్ర మాత్రలు ఆరోగ్యానికి అసలు మంచివి కావు.వాటిని వేసుకోవటం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

నిద్ర పట్టనప్పుడు నిద్ర మాత్రలు వేసుకుంటే తాత్కాలికంగా నిద్ర పడుతుంది.అలా అలవాటు పెరిగి నిద్ర మాత్రల డోస్ పెంచాల్సిన అవసరం వస్తుంది.

అప్పుడు శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది.నిద్ర మాత్రలు వేసుకోవటం వలన సెమీ కాన్సియస్ నెస్ పెరుగుతుంది.

ఆ సమయంలో కలత నిద్ర,నిద్రలేమి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.అంతేకాక నిద్ర పోతున్నసమయంలో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

నిద్ర మాత్రలు వేసుకోవటం అనేది ఒక వ్యసనముగా మారుతుంది.ఒకసారి అలవాటు పడితే మానటం చాలా కష్టం అవుతుంది.

ఒకవిధంగా చెప్పాలంటే డ్రగ్స్ కి బానిస అయినట్టే.

నిద్ర మాత్రలు వేసుకొనే వారికి గుండె జబ్బులు,చర్మ ఎలర్జీలు వంటివి వచ్చే అవకాశం ఉంది.

కాబట్టి నిద్ర మాత్రలు వేసుకోవడానికి ముందు డాక్టర్ ని తప్పనిసరిగా సంప్రదించాలి.ముందుగా ఏకాగ్రత దెబ్బతింటుంది.

జ్ఞాపక శక్తి ప్రభావితమవుతుంది.శారీరకంగా కూడా పని సామర్థ్యం తగ్గిపోతుంది.

పగటి నిద్ర, ఆందోళన, చికాకు.భావోద్వేగాలు మారిపోతాయి.

నిద్రమాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మెమరీ లాస్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube