జుట్టు పొడిగా మారటం వలన అనేక రకాలైన సమస్యలు మొదలు అవుతాయి.తల చర్మం మీద తేమ తగ్గిపోయి పొడిగా మారటం వలన చుండ్రు వంటి సమస్యలు రావటమే కాకుండా ఎటువంటి హెయిర్ స్టైల్స్ కి సహకరించదు.
అయితే జుట్టు ఎందుకు పొడిగా
మారుతుందో కారణాలు తెలుసుకొని చికిత్స చేయించుకుంటే లాభం ఉంటుంది.ఇప్పుడు జుట్టు పొడిగా మారటానికి గల కారణాలను తెలుసుకుందాం.
హైపోథైరాయిడిజమ్ వంటి డిజాస్టర్స్ తో బాధపడేవారిలో జుట్టు పొడిగా మారుతుంది.
వేడితో ఉపయోగించే స్టెయిట్నర్స్ వంటి వాటిని ఉపయోగించటం వలన వేడి కారణంగా తేమ తగ్గిపోయి పొడిగా మారుతుంది.
వీటి వాడకం తగ్గితే జుట్టు
పొడిదనం తగ్గుతుంది.
ఘాడమైన రసాయనాలు ఉన్న జుట్టు సంరక్షణ ఉత్పత్తులను వాడినప్పుడు జుట్టు
పొడిగా మారుతుంది.
కాబట్టి సాధ్యమైనంత సహజమైన ఉత్పత్తులను వాడటానికి
ప్రయత్నం చేయాలి.
జట్టుకు రెగ్యులర్ గా నూనె రాయకపోతే జుట్టు పొడిగా మారిపోతుంది.
కాబట్టి
కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ రాస్తే జుట్టు మృదువుగా,తేమగా ఉంటుంది.

జుట్టుకి రంగులు వాడటం వలన కూడా జుట్టు పొడిగా మారిపోతుంది.కాబట్టి
జుట్టుకి రంగు వేసుకొనేటపుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
తలస్నానము చేసినప్పుడు తల తడిగా ఉన్నప్పుడు దువ్వెనతో దువ్వకూడదు.
ఆలా
దువ్వటం వలన జుట్టు కుదుళ్ళు పాడయ్యి తేమ తగ్గి పొడిగా మారుతుంది.
జుట్టును అదే పనిగా ఎక్కువ సార్లు దువ్వకూడదు.
రోజుకి రెండు సార్లు కన్నా ఎక్కువ సార్లు దువ్వకూడదు.ఒకవేళ దువ్వితే జుట్టు రాలిపోవటమే కాకుండా పొడిగా మారుతుంది.