కడుపు నొప్పి. దాదాపు అందరూ ఈ సమస్యను ఏదో ఒక సమయంలో ఫేష్ చేసిన వారే అనడంలో సందేహం లేదు.
ఎప్పుడు వస్తుందో చెప్పలేని ఈ కడుపు నొప్పి చాలా ఇబ్బందికరంగా మరియు తట్టుకోలేనంత బాధను కలిగిస్తుంది.ఆహారపు అలవాట్లు, అల్సర్, ఫుడ్ పాయిజన్, గ్యాస్ ఇలా రకరకాల కారణాల వల్ల కడుపు నొప్పి సమస్య వస్తుంది.
అయితే చాలా మంది కడుపు నొప్పి రాగానే.టక్కున టాబ్లెట్ వేసేసుకుంటారు.
కానీ, నిజానికి న్యాచురల్‌గా కూడా కడుపు నొప్పి నిమిషాల వ్యవధిలోనే తగ్గించుకోవచ్చు.మరి ఆ న్యాచురల్ చిట్కాలు ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.

కడుపు నొప్పి వచ్చినప్పుడు పుదీనా ఆకులు అద్భుతంగా సహాయపడతాయి.ఒక గ్లాస్ నీటిలో కొన్ని పుదీనా ఆకులు వేసి.మరిగించి గోరు వెచ్చగా అయ్యాక తాగలి.లేదా కొన్ని పుదీనా ఆకులను తీసుకుని.
శుభ్రంగా కడిగి నోట్లో వేసుకుని బాగా నమిలి తినేయాలి.ఆ తర్వాత ఓ అర గ్లాస్ వాటర్ సేవించాలి.
ఇలా చేస్తే కడుపు నొప్పి నుంచి నిమిషాల్లోనే ఉపశమనం లభిస్తుంది.

అలాగే కడుపు నొప్పిని నివారించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా గ్రేట్‌గా సహాయపడుతుంది.ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి.సేవించాలి.
ఇలా చేస్తే ఎంత తీవ్రమైన కడుపు నొప్పి అయినా సులువుగా తగ్గిపోతుంది.అలాగే కడుపు నొప్పి ఇబ్బంది పెడుతుంటే.
రెండు యాలకులను నోట్లో వేసుకుని.బాగా నమిలి మింగేయాలి.
ఇలా చేసినా కడుపు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

ఇక పెరుగు కూడా కడుపు నొప్పిని తగ్గించగలదు.పెరుగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా మరియు పలు పోషకాలు కడుపు నొప్పిని త్వరగా దూరం చేయగలవు.అందువల్ల, కడుపు నొప్పి వచ్చిన సమయంలో ఒక అరకప్పు పెరుగు తీసుకోవడం మంచిది.
అయితే కడుపు వచ్చినప్పుడు పైన చెప్పుకున్న చిట్కాలు పాటించడమే కాదు.ఎక్కువ సేపు విశ్రాంతి కూడా తీసుకోవాలి.