మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో షాకింగ్ ట్విస్ట్ ఇదే.. ఆ టెన్షన్ తీరిపోయినట్టేనా?

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) తనయుడు నందమూరి మోక్షజ్ఞ( Nandamuri Mokshagna ) సినీ ఎంట్రీ కోసం అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.అభిమానులు ఎదురుచూస్తున్నట్టుగానే ఆ సినిమా ప్రకటన కూడా వచ్చేసింది.

 Mokshagna Debut Film Update Details, Mokshagna, Mokshagna Debut Film, Tollywood,-TeluguStop.com

మోక్షజ్ఞ కొత్త లుక్ కి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ప్రశాంత్ వర్మ( Prashanth Varma ) దర్శకత్వంలో ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందనుందని అధికారికంగా కూడా ప్రకటించారు.అయితే ప్రకటన వచ్చి ఆరు నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ( Mokshagna Debut Movie ) పట్టాలెక్కలేదు.

దాంతో ఈ మధ్యకాలంలో ప్రశాంత వర్మ,మోక్షజ్ఞ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు కూడా వినిపించాయి.

Telugu Prashanth Varma, Jai Hanuman, Mokshagna, Mokshagna Debut, Tollywood-Movie

మోక్షజ్ఞకు సినిమాలపై ఆసక్తి లేదని, ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి.అసలు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడా? ఇస్తే ఎప్పుడు? దర్శకుడు ప్రశాంత్ వర్మేనా లేక మరొకరా? ఇలా రకరకాల ప్రశ్నలు నందమూరి అభిమానులను వేధిస్తున్నాయి.అయితే వాటన్నింటికీ సమాధానం దొరకబోతోందట.

మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారాన్ని నమ్మొద్దని, అవన్నీ తప్పుడు వార్తలని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.

నిజంగానే ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని తెలుస్తోంది.కానీ పట్టాలెక్కడానికి మాత్రం ఇంకాస్త సమయం పడుతుందట.

ప్రస్తుతం హనుమాన్ సినిమాకు సీక్వల్ గా కన్నడ హీరో రిషబ్ శెట్టితో జై హ‌నుమాన్ మూవీ( Jai Hanuman Movie ) చేస్తున్నాడు దర్శకుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌.

Telugu Prashanth Varma, Jai Hanuman, Mokshagna, Mokshagna Debut, Tollywood-Movie

ఆ సినిమా పూర్తి అయ్యాక, మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ని మొదలు పెడతాడట.ఈ లోపు మోక్ష‌జ్ఞ కూడా యాక్టింగ్, డ్యాన్స్ త‌దిత‌ర విభాగాల్లో శిక్షణ పొంది, పూర్తి స్థాయిలో సిద్ధమవుతాడట.కాస్త ఆలస్యమైనా ముందుగా అనుకున్నట్టు, మోక్ష‌జ్ఞ డెబ్యూ బాధ్యతను ప్ర‌శాంత్ వ‌ర్మ‌కే అప్పగించాలని బాల‌కృష్ణ‌ నిర్ణయించుకున్నారట.

మోక్షజ్ఞ డెబ్యూకి ఈ సబ్జెక్టే కరెక్ట్ అని బాలయ్య భావిస్తున్నారట.అన్నీ అనుకున్నట్టు జరిగితే నందమూరి అభిమానుల ఎదురు చూపులు వచ్చే ఏడాది ఫలించనున్నాయట.ఎందుకంటే మోక్ష‌జ్ఞ మొదటి చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube