దాదాపు ప్రతి ఒక్కరి వంటింట్లోనూ ఉండే వెల్లుల్లి గురించి పరిచయాలు అక్కర్లేదు.వంటల్లో రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వెల్లుల్లి (Garlic)విస్తృతంగా ఉపయోగించబడుతుంది.
అయితే వెల్లుల్లిని కొందరు కాల్చి తింటుంటారు.కాల్చిన వెల్లుల్లి మృదువుగా, రుచికరంగా ఉంటుంది.
అలాగే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
కాల్చిన వెల్లుల్లి శరీరంలోని విషతత్వాలను బయటకు పంపించడంలో సహాయపడుతుంది.
కాలేయాన్ని(Liver) శుభ్రపరిచి దాని పనితీరును మెరుగుపరుస్తుంది.కాల్చిన వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్(Antibacterial, antifungal, antiviral) లక్షణాలు ఉంటాయి.
ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి వేగంగా రికవరీ అయ్యేందుకు తోడ్పడతాయి.

అధిక రక్తచక్కెర సమస్య ఉన్నవారి కాల్చిన వెల్లుల్లి (roasted garlic)ఒక సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు.రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడంలో కాల్చిన వెల్లుల్లి(garlic) చాలా అద్భుతంగా సహాయపడుతుంది.కాల్చిన వెల్లుల్లి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.రక్త పోటును నియంత్రిస్తుంది.తద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

మెదడు ఆరోగ్యానికి కూడా కాల్చిన వెల్లుల్లి చాలా మంచిది.కాల్చిన వెల్లుల్లి నాడీ వ్యవస్థను మెరుగుపరిచి, మెమరీ పవర్ ను పెంచుతుంది.ఆల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది.
కాల్చిన వెల్లుల్లిలో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.మెటిమల సమస్యకు అడ్డుకట్ట వేస్తాయి.
కాల్చిన వెల్లుల్లిని తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల రిస్క్ కూడా తగ్గుతుంది.అయితే ఈ ప్రయోజనాలను పొందడం కోసం రోజుకు రెండు నుంచి మూడు రెబ్బలు తింటే సరిపోతుంది.
కాల్చిన వెల్లుల్లిని సూప్, సలాడ్, లేదా ఇతర వంటకాలలో కలిపి కూడా తినొచ్చు.అధికంగా తింటే కొన్ని సందర్భాల్లో అజీర్ణం, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తలెత్తవచ్చు.