తరుణ్ బాల నటుడిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి ఆ తర్వాత హీరోగా మారాడు.ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి టాప్ హీరోగా ఎదిగాడు.
ఆ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకున్నాడు.సినిమా హీరోగా ఎంత పాపులర్ అయ్యాడో వివాదాలతోనూ అంతే రచ్చకెక్కాడు.
అయితే గడిచిన కొన్ని సంవత్సరాలుగా తను ఏం చేస్తున్నాడో ఎక్కడున్నాడో బయటకు తెలియడం లేదు.అసలింతకీ తరుణ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తరుణ్ మూడేళ్ల క్రితం ఇది నా లవ్ స్టోరీ సినిమాతో జనాల ముందుకు వచ్చాడు.ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.ఈ సినిమాకు ముందు కూడా సుమారు 4 ఏండ్ల పాటు కనిపించలేదు.సినిమా పరిశ్రమకు దూరం అవుతున్నాడు అనుకున్న సమయంలో ఇది నా లవ్ స్టోరీతో జనాలకు నేనున్నాను అని చెప్పే ప్రయత్నం చేశాడు.అయితే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.తేజ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన తరుణ్.నువ్వే కావాలి సినిమాతో హీరోగా మారాడు.ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే సినిమాలు తనను టాప్ హీరోగా నిలిపాయి.
ఆ తర్వాత తను చేసిన నిన్నే ఇష్టపడ్డా, ఎలా చెప్పను, సఖియా, సోగ్గాడు, ఒక ఊరిలో సహా పలు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఆ తర్వాత చేసిన నవవసంతం సినిమా కాస్త ఫర్వాలేదు అనిపించింది.ఆ తర్వాత భలే దొంగలు, శశిరేఖా పరిణయం సినిమాలు చేశాడు.కానీ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.
అనంతరం చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి సినిమా కూడా అంతగా ఆడలేదు.ఆ తర్వాత వచ్చిన యుద్ధం, వేట సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.ఆ తర్వాత నాలుగేళ్లకు వచ్చిన ఇది నా లవ్ స్టోరీ కూడా ఫ్లాప్ అయ్యింది.అయితే.కథల విషయంలో జాగ్రత్త లేకపోవడం మూలంగా అతడి కెరీర్ దెబ్బతిన్నది.అటు కొంత కాలం నుంచి తనను డ్రగ్స్ కేసు వెంటాడుతుంది.
ఇప్పటికే ఆయనను ఎక్సైజ్ అధికారులు విచారించగా.తాజా ఈడీ విచారణకు రెడీ అవుతున్నాడు.