వయసు పైబడే కొద్దీ ఎముకలు( Bones ) బలహీనంగా మారడం అనేది సర్వసాధారణం.కానీ ఇటీవల రోజుల్లో పాతిక, ముప్పై ఏళ్ల వయసులో ఉన్న వారు సైతం ఎముకల బలహీనతతో బాధపడుతున్నారు.
ఉప్పును అధికంగా వినియోగించడం, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాల కొరత, మద్యపానం, శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం తదితర కారణాల వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి.నిజానికి మన శరీరం మొత్తం ఎముకల పైనే ఆధారపడి ఉంటుంది.
అటువంటి ఎముకలు బలహీనంగా మారితే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.కాబట్టి ఎముకలను దృఢంగా ఉంచుకోవడం ఎంతో అవసరం.

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే పొడి చాలా బాగా సహాయపడుతుంది.నిత్యం ఈ పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే ఎముకల బలహీనత పరార్ అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పొడిని ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక కప్పు అవిసె గింజలు( Flax seeds) వేసి దోరగా వేయించుకుని తీసుకోవాలి.
ఆ తర్వాత అదే పాన్ లో ఒక కప్పు గుమ్మడి గింజలు( Pumpkin seeds ), ఒక కప్పు పొద్దు తిరుగుడు గింజలు, ఒక కప్పు బాదం పప్పు, అరకప్పు పిస్తా పప్పు, అరకప్పు నువ్వులు విడివిడిగా వేయించుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించుకున్న పదార్థాలను సపరేట్ గా గ్రైండ్ చేసి ఒక బౌల్ లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.అలాగే ఈ పొడిలో రెండు కప్పులు సన్నగా తరిగిన బెల్లం పొడి కూడా వేసి కలిపి ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.నిత్యం ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో తయారు చేసుకున్న పొడిని కలిపి తీసుకోవాలి.
ఈ విధంగా చేశారంటే అదిరిపోయే ఆరోగ్య లాభాలు మీ సొంతమవుతాయి.ఈ పొడిలో కాల్షియం, జింక్, ఐరన్, పొటాషియం వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
ఈ పొడిని పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది.బలహీనంగా మారిన ఎముకలు గట్టిగా దృఢంగా తయారవుతాయి.
ఎముకల బలహీనత సమస్య పరారవుతుంది.నిత్యం ఈ పొడిని తీసుకుంటే 60లో కూడా మీరు పరుగులు పెడతారు.
అంతేకాదు ఈ పొడి కండరాల నిర్మాణానికి తోడ్పడుతుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
హెయిర్ ఫాల్ సమస్యను అరికడుతుంది.మరియు బాడీని ఫిట్ గా మారుస్తుంది.