సాధారణంగా ఎంతోమందికి పెళ్లివయసు దాటిన ఉన్నప్పటికీ పెళ్లి సంబంధాలు కుదరవు.అలాంటప్పుడు ఎన్నో పూజలు హోమాలు చేస్తుంటారు.
ఈ క్రమంలోనే పెళ్ళి ఆలస్యం అవుతున్న అమ్మాయిలకు రుక్మిణీ కల్యాణం చదివితే పెళ్లి కుదురుతుందని, కాత్యాయని వ్రతం, లలితా దేవిని పూజించమని పలు విధాలుగా చెబుతుంటారు.ఈ విధంగా చేయడం వల్ల అమ్మాయిలకు తొందరగానే వివాహ ఘడియలు వస్తాయని చెప్పడం మనం చూస్తూనే ఉంటాం.
అమ్మాయిలకైతే ఇలాంటి పరిహారాలు చేస్తారు.మరి పెళ్లి కుదరని అబ్బాయిల పరిస్థితి ఏమిటి? వారు ఎలాంటి పూజలు చేయాలి? పెళ్లి కాని అబ్బాయిలకు ఏవైనా పరిష్కారా మార్గాలు ఉన్నాయా? అంటే ఉన్నాయని చెప్పవచ్చు.అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
దేవతలు, రాక్షసులు కలసి క్షీరసాగరమధనం చేస్తున్నప్పుడు సముద్రగర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది.ఆ విధంగా లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు.
కనుక దీనిని “సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం” అంటారు.ఈ స్తోత్రం ఎంతో శక్తివంతమైనది.
ఈ స్తోత్రాన్ని నియమనిష్టలతో పారాయణం చేయడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

“సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం”కనీసం నలభై ఒక్క రోజుల పాటు క్రమం తప్పకుండా నియమనిష్టలతో పారాయణం చేసి ప్రతి మంగళ, శుక్రవారాలలో ఆవు పాలతో తయారుచేసిన పరమాన్నం ఆ లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించిన వారికి సమస్త దోషాలు తొలగిపోతాయి.ఈ విధంగా 41 రోజులపాటు ఈ పారాయణం చేయడం ద్వారా వివాహం ఆలస్యము అవుతున్న అబ్బాయిలకు సైతం వివాహ ఘడియలు దగ్గర పడటంతో పాటు, సౌందర్యవతి, అనుకూలవతి అయిన కన్య భార్యగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు.ఈ విధంగా వివాహం ఆలస్యమవుతున్న అబ్బాయిలు “సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం”పారాయణం వల్ల పెళ్లి అయిన స్త్రీలు దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారు.