గరుడ పురాణంలో ఆత్మలే దెయ్యాలు ప్రేతాత్మలుగా మారుతాయని వెల్లడించారా..!

గరుడ పురాణంలో( Garuda Puranam ) మరణం తర్వాత సంఘటనలను వివరంగా తెలిపారు.గరుడ పురాణం లో జననం, మరణం, పునర్జన్మ, కర్మ, ఆత్మ, పాపం, పుణ్యం, నీతి, మతం, జ్ఞానానికి సంబంధించిన విషయాలను వివరించింది.

 In The Garuda Purana, It Is Revealed That The Spirits Turn Into Ghosts, Garuda P-TeluguStop.com

దీనితో పాటు మరణం తర్వాత ఆత్మ మానవ రూపంలోకి ప్రేత రూపంలోకి వెళ్లడం గురించి కూడా గరుడ పురాణంలో వెల్లడించారు.వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Vastu, Vastu Tips-Latest News - Telugu

మరణం తర్వాత ఆత్మ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఆకలి, దాహం, కోపం, దుఃఖం, కామం అనే భావాలు అందులో ఉంటాయని గరుడ పురాణంలో తెలిపారు.గరుడ పురాణంలో మొత్తం 84 లక్షల కులాల ప్రస్తావన ఉంది.అందులో జంతువు, పక్షి, చెట్టు, క్రిమి-సాలీడు, మానవుడు వంటి ఆత్మలు ఉన్నాయి.మరణం అనంతరం ఒక వ్యక్తి ఆత్మ ఏ జన్మకు వెళ్తుందో అది అతని జీవితకాలపు పనులపై మాత్రమే ఆధారపడి ఉంటుంది.

దుర్మార్గుల ఆత్మలు మృత్యు లోకంలో సంచరిస్తూనే ఉంటాయి.అంతేకాకుండా ఒక వ్యక్తి మరణం ప్రమాదం, హత్య లేదా ఆత్మహత్య మొదలైన వాటి కారణంగా తన ఆత్మ శరీరాన్ని సహజమరణంతో విడిచి పెట్టకపోతే ఆత్మ ప్రేతాత్మగా మారుతుంది.

ఇంకా చెప్పాలంటే గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ శాంతిని పొందదు.ఆత్మ సహజమైన పద్ధతిలో తన శరీరాన్ని విడిచిపెట్టదు.అటువంటి పరిస్థితులలో ఆత్మ ప్రేతాత్మగా సంచరిస్తూనే ఉంటుంది.

Telugu Vastu, Vastu Tips-Latest News - Telugu

అందుకే మరణం తర్వాత మరణించిన వ్యక్తి పిండాదన, శ్రద్ధ గురించి గ్రంథాలు చెబుతున్నాయి.నియమానుసారంగా పిండాదనాన్ని, శ్రాద్ధాన్ని ఆచరించడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి కలుగుతుంది.కానీ కొన్ని ఆత్మలు నెరవేరని కర్మలు లేదా చెడు పనుల వల్ల అస్థిరంగా మరణ భూమిలో సంచరిస్తూనే ఉంటాయి.

ఇలాంటి దయ్యాలు ఏ రూపంలో ఉన్న ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాయి.అలాంటి ఆత్మలను మనం సాధారణ పరిభాషలో దయ్యాలు అని అంటాము.అందుకే మానవుడు తన జీవితకాలంలో పాపపుణ్యాలు చేయకూడదని గరుడ పురాణంలో ఉంది.తన జీవితకాలంలో ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పుణ్య కార్యాలు ఆచరించేవారు మరణం తర్వాత కూడా మంచి మోక్షాన్ని పొందుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube