సన్నీ లియోన్ గురించి ఈ తరం యువతీ యువకులకు పెద్దగా చెప్పనవసరం లేదు.ఆమె పేరు వినగానే కుర్రకారు అంతా కూడా తెగ రెచ్చిపోతూ ఉంటారు.
ఇక ఆమె సినిమాలు ఏవైనా రిలీజ్ అవుతున్నాయి అనగానే థియేటర్ల ముందు బారులు తీరుతూ ఉంటారు.పెద్దల(అడల్ట్) సినిమాల నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అనతికాలంలోనే టాప్ రేటింగ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
అయితే తన ప్రయాణం ఒక్క బాలీవుడ్ కె కాకుండా సౌత్ చిత్రాలపై కూడా సన్నీ దృష్టి పెట్టింది.ఈ క్రమంలోనే సౌత్ లో కూడా కొన్ని సినిమాలు చేసి తనకంటూ ఒక స్థానాన్ని పొందగలిగింది.
అయితే ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్దలు సినిమాలు లేకపోయినా, అటు మలయాళం,తమిళం లలో సినిమాలు చేస్తుంది సన్నీ.ఈ క్రమంలో ప్రస్తుతం మలయాళంలో ముమ్ముట్టి సినిమాలో నటిస్తుండగా, మరో చిత్రం వీరమాదేవి చిత్రంలో కూడా నటిస్తుంది.

అయితే ఇప్పుడు ఈ అమ్మడు తన దగ్గరకు వచ్చే దర్శక నిర్మాతలకు కొన్ని కండీషన్స్ పెడుతుందట.అదేదో కథ బాగుండాలి, తన పాత్రకు ప్రాధాన్యత ఉండాలి ఇలాంటి కండీషన్స్ కాదులెండి.కేవలం ఆమె వద్దకు వెళ్లే నిర్మాతలు బౌండ్ స్క్రిప్ట్ మైంటైన్ చేయాలి అంట,అంతేకాకుండా వారు క్రమశిక్షణ తో వ్యవహరించాలి ఇలా కొన్ని కండీషనస్ పెడుతుందట.దీనితో నిర్మాతలు నోరెళ్లబెడుతున్నారు.
బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే ఆమెకు స్క్రిప్ట్ పై వివరణ ఇవ్వడానికి అర్హులు అని తేల్చింది ఈ అమ్మడు.మరి ఈ షరతులను ఎంతమంది పాటించి ఈ అమ్మడికి అవకాశాలు ఇస్తారో చూడాలి.








