'గులాబో సితాబో' లో అమితాబ్ లుక్స్ చూస్తే ఆశ్చర్యపోకమానరు

నటీనటులు ఎప్పుడు ఎలా మారిపోతారో ఎవ్వరికీ అర్ధం కాదు.వారి వేషధారణ,వస్త్ర ధారణ అన్ని కూడా సినిమా కోసం మార్చేసుకుంటూ ఉంటారు.

 Amitab Looks In Gulabo Sitabo Movie1 1 1-TeluguStop.com

వారు చేసే పాత్రలో జీవించడం కోసం ఎంతో కష్టపడుతూ తన టాలెంట్ ను నిరూపించుకుంటారు.అయితే ఈ రోజు మెగాస్టార్ సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదల అయ్యింది.

ఆ చిత్రంలో ఎవరో వృద్ధుడు కనిపిస్తుండగా తొలుత ఎవ్వరికి అర్ధం కాలేదు.ఆ తరువాత గాని అభిమానులు పోల్చుకోలేక పోయారు.

ఆయన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అని.ఆయన ప్రస్తుతం దర్శకుడు శూజిత్ సర్కార్ తెరకెక్కిస్తున్న ‘గులాబో సితాబో’ సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఆ చిత్రంలో అమితాబ్ ఎలా ఉంటుందో ఆ లుక్ చూస్తే తెలుస్తుంది.ఈ చిత్రంలో అమితాబ్ లఖ్ నవూ కు చెందిన ఒక కపిష్ఠి ఇంటి యజమాని పాత్రలో కనిపించబోతున్నారు.

అయితే ఆయన లుక్స్ చూడగానే అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.నిజంగా అమితాబ్ యేనా ఆ పోస్టర్ లో ఉంది అన్నంతలా వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు.

'గులాబో సితాబో' లో అమితాబ్ లుక

ఇందులో ఆయుష్మాన్‌ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఈ సినిమా కోసం అమితాబ్‌కు ప్రోస్తెటిక్‌ మేకప్‌ వేసినట్లు తెలుస్తుంది.అయితే ఈ మేకప్‌ వేయించుకోవడానికి తాను చాలా అలసిపోయేవాడినని ఒక సారి మీడియా తో మాట్లాడుతూ అమితాబ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా ఈ చిత్రంలో అమితాబ్‌ లుక్‌ ఎలా ఉండబోతోందో ముందుగానే శూజిత్‌ పేపర్‌పై బొమ్మ గీసి బిగ్‌బికి చూపించాకే అమితాబ్ ఈ సినిమా లో నటించడానికి ఒప్పుకున్నారట.ఫ్యామిలీ డ్రామా కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2020 ఏప్రిల్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube