1.గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్ షాప్
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహించారు.
2.లాలూ ప్రసాద్ యాదవ్ కు జరిమానా
13 ఏళ్ల నాటి కేసులు ఆర్జేడీ అధినేత బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు కోర్టు జరిమానా విధించింది.
3.జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు .
4.కోవిడ్ టెస్టులు పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వం కు ఆదేశాలు
రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ టెస్ట్ ల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
5.పర్యావరణ సూచీలో అట్టడుగున ఇండియా
దేశంలో పర్యావరణ ప్రమాదం అంచున ఉంది. తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో పర్యావరణ పనితీరు లో భారత్ అత్యంత వెనుకబడి ఉంది.
6.ఆ పాఠ్యపుస్తకాలను రద్దు చేసే ప్రశ్నే లేదు
కర్ణాటకలో ఎప్పటికీ ముద్రితమైన పాఠ్యపుస్తకాలను ఒక సంవత్సరం తీసుకునే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ చెప్పారు.
7.చింతమనేని ప్రభాకర్ కామెంట్స్
ప్రశాంత దెందులూరు లో రౌడీ షీటర్స్ వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ విమర్శించారు.
8.లా సెట్ గడువు పెంపు
లా సెట్ దరఖాస్తు గడువును ఈ నెల 16 వరకు పొడిగిస్తున్నట్లు కన్వీనర్ బి వి రెడ్డి తెలిపారు.
9.కెసిఆర్ పై ప్రజలకు నమ్మకం లేదు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం లేదని డీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 10.కోవిడ్ కేసుల పెరుగుదల దేశంలో ఇటీవల కాలం లో మళ్లీ కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.ఒక్క రోజులోనే 40 శాతం కేసులు పెరిగినట్టు తాజా నివేదికలో వెల్లడయ్యింది .
11.తిరుమలకు ఏపీ గవర్నర్
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ రోజు తిరుమల తిరుపతి పర్యటనకు వెళ్లారు.మధ్యాహ్నం శ్రీవారిని ఆయన దర్శించుకోనున్నారు.
12.తిరుపతికి సుప్రీం కోర్టు సీజేఐ
మూడు రోజుల పర్యటన నిమిత్తం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ తిరుపతికి రానున్నారు. 13.నేడు విశాఖ కు మంత్రి ఆర్కే రోజా రానున్నారు.పర్యాటక నౌక ఇంప్రెస్ ను ఆమె సందర్శించనున్నారు.
14.ఆంధ్ర యూనివర్సిటీ లో జాబ్ మేళా
విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ లో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.
15.షర్మిల పాదయాత్ర
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన పాదయాత్ర నేడు ఖమ్మం జిల్లా వైరా మండలం లో కొనగుతోంది.
16.మల్లన్న సేవలో జస్టీస్ ఆదర్శ్ కుమార్ గోయల్
నేడు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను జాతీయ హరిత ట్రిబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ అదర్స్ కుమార్ గోయల్ దర్శించుకోనున్నారు.
17.పేర్ని నాని పై జీవీయెల్ కామెంట్స్
బీజేపీ ని ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని చేసిన విమర్శలపై బీజేపీ నేత జీవీ ఎల్ నరసింహారావు మండిపడ్డారు.మాది పువ్వు పార్టీనా… జేపీ నడ్డా అడ్డంగా బలిసారా అంటూ నానిపై జీవీఎల్ ఫైర్ అయ్యారు .
18.మంత్రి విశ్వరూప్ పై రైతు పరిరక్షణ సమితి ఆగ్రహం
కోనసీమ జిల్లాలో క్రాప్ హాలిడే రైతుల పై మంత్రి విశ్వరూప్ చేసిన వ్యాఖ్యలపై రైతు పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది.
19.పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్
రోడ్డెక్కని రైతులు, పని చేయని నాయకులు తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు.
20.ఈ రోజు బంగారం ధరలు
22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,700 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర -52,040
.