జుట్టు త‌ర‌చూ చిట్లిపోతుందా? అయితే ఈ రెమెడీని మీరు పాటించాల్సిందే!

సాధారణంగా కొందరి జుట్టు తరచూ చిట్టి పోతూ ఉంటుంది.వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పులు, రెగ్యుల‌ర్‌గా త‌ల‌స్నానం చేయ‌డం, పోష‌కాల కొర‌త‌, హెయిర్ స్టైలింగ్ టూల్స్‌ను అధికంగా వినియోగ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల ఈ స‌మ‌స్య ఏర్ప‌డుతుంది.

 This Is A Super Remedy For Repairing Damaged Hair! Super Remedy, Damaged Hair, L-TeluguStop.com

జుట్టు చిట్లి పోవడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా ఆగిపోతుంటుంది.ఎన్ని షాంపూలు, ఆయిల్స్ ను మార్చిన ఈ సమస్యకు అడ్డుకట్ట వేయలేకపోతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీని పాటిస్తే చాలా సులభంగా చిట్లిన జుట్టును నివారించుకోవచ్చు.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్ ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ కోక‌నట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, మూడు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, అరకప్పు రోజ్ వాటర్ వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సహాయంతో ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా మిక్స్ చేయాలి.

అనంతరం ఈ మిశ్రమాన్ని నైట్ నిద్రించే ముందు జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.

Telugu Tips, Damaged, Care, Care Tips, Remedy, Latest-Telugu Health Tips

మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూ యూస్ చేసి గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.వారంలో రెండు సార్లు ఇలా చేస్తే చిట్లిన‌ జుట్టు రిపేర్ అవుతుంది.అదే సమయంలో జుట్టు మళ్ళీ మళ్ళీ చిట్లకుండా కూడా ఉంటుంది.

తద్వారా హెయిర్ గ్రోత్ రెట్టింపు అయ్యి జుట్టు ఒత్తుగా మరియు పొడుగ్గా పెరుగుతుంది.కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ఈ రెమెడీని ప్ర‌య‌త్నించండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube