మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.హత్య కేసు దర్యాప్తును ఏపీలో కాకుండా మరే ఇతర ప్రాంతంలో చేపట్టాలని వివేకా కూతురు సునీతా రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేసేందుకు సీబీఐ సమయం కోరింది.అదేవిధంగా కౌంటర్ దాఖలుకు ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధంగా న్యాయవాది తెలిపారు.
ఈ సందర్భంగా ఒకటి,రెండు రోజులు సమయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ తరపు లాయర్ కోరారు.సాక్షులకు వన్ ప్లస్ వన్ భద్రత కల్పిస్తున్నట్లు సర్కార్ తెలపగా.
సాక్షులకు ఇస్తున్న భద్రత సరిపోతుందా అని ధర్మాసనం ప్రశ్నించింది.దీనిపై ప్రభుత్వం అవసరం అయితే ఎక్కువ మందితో భద్రత కల్పిస్తామని తెలిపింది.
కానీ సర్కార్ ఎలాంటి బాధ్యత తీసుకోవడం లేదని సుప్రీం ఫైర్ అయ్యింది.మరోవైపు ఏ5 శివశంకర్ రెడ్డి తమ వాదన కూడా వినాలని కోరగా.
ఈనెల 19న పరిశీలిస్తామని న్యాయస్థానం వెల్లడించింది.అనంతరం తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది.