దీపావళి రోజు లక్ష్మి గణపతులను ఇలా పూజించడం వల్ల మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు వస్తాయా..

తాజాగా దీపావళి పండుగను ప్రజలు జరుపుకోవడానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి.మనదేశంలో ఒక్కొక్క పండక్కి ఒక్కో రకమైన పూజలను, ఉపవాసలను చేస్తూ ఉంటారు.

 By Worshiping Lakshmi Ganapati Like This On Diwali Day, Lakhsmi Devi,lakshmidevi-TeluguStop.com

సనాతన సంప్రదాయంలో కార్తీక మాసంలోని అమావాస్య రోజున సుఖ సంపదలను ఇచ్చే గణేశుడిని , సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని పూజించడం చాలా పవిత్రమైనదిగా ప్రజలందరూ భావిస్తారు.దీపావళి రోజున అష్టైశ్వర్యానికి దేవత ఆయన లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి.

రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇంట్లో సంపద రెట్టింపు అవుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.ఇలాంటి పరిస్థితులలో దీపావళి రోజు రాత్రి ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి తన ఇంటికి వచ్చి తన ఆశీస్సులను తమ కుటుంబ సభ్యులకు అందించాలని ప్రజలందరూ కోరుకుంటుంటారు.

దీపావళి రోజున లక్ష్మీదేవి పూజ విధానం ఏమిటంటే,దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజించడానికి ముందు ఇంటిని మొత్తం పరిశుభ్రం చేసుకోవాలి.ఎందుకంటే పరిశుభ్రత ఉన్న చోట సంపద చిహ్నం అయిన లక్ష్మీదేవి నిలబడుతుందని చాలామంది ప్రజల నమ్మకం.

లక్ష్మీ దేవిని పూజించడానికి ఈశాన్య దిక్కును ఎంచుకోవడం మంచిది.పూజించే స్థలాన్నీ శుభ్రం చేసి గంగా జలంతో శుభ్రం చేసుకోవాలి.

గణేష్-లక్ష్మిదేవిని పూజించాలనుకునే ప్రదేశంలో ముందుగా ఒక పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరుచుకోవాలి.దానిపై నవగ్రహాలను ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత లక్ష్మీగణపతులను స్థాపించండి మంచిది.

లక్ష్మి ఆశీర్వాదం పొందడానికి గణపతిని ఎందుకు పూజించాలంటే,వినాయకుడి నుండి ఆశీర్వాదం లేకుండా ఏ పని పూజ ఫలితాన్ని ఇవ్వదు అని వేద పండితులు చెబుతారు.కాబట్టి లక్ష్మీదేవి పూజకు ముందు గణపతిని పూజించడం వల్ల, మనిషి సంపద, శ్రేయస్సు లభిస్తాయని ప్రజలందరూ నమ్ముతారు.

Telugu Coconut, Devotioanl, Devotional, Diwali, Ganapathi, Lakhsmi Devi, Lakshmi

దీపావళి రోజున ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీ దేవి పూజలో ఆమెకు ఇష్టమైన ఆవుపాలు, కొబ్బరికాయ, గోమతి చక్రం, నాగకేసర, తామరపువ్వు మొదలైన వాటిని తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పించాలి.లక్ష్మీదేవిని ఈ విధంగా పూజిస్తే ఆ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉండవని వేద పండితులు చెప్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube