స‌మ్మ‌ర్ లో ఈ ఫుడ్స్ జోలికి అస్స‌లు పోవొద్దు గురూ!

స‌మ్మ‌ర్ సీజ‌న్ ( Summer season )స్టార్ట్ అయింది.ఎండ‌లు మెల్ల‌మెల్ల‌గా ముదురుతున్నాయి.

 What Foods Should Be Avoided In The Summer Season? Summer, Summer Health, Health-TeluguStop.com

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్‌, హీట్ స్ట్రోక్, అల‌స‌ట త‌దిత‌ర స‌మ‌స్య‌లు చాలా ఎక్కువ‌గా ఇబ్బంది పెడుతుంటాయి.అందుకే స‌మ్మ‌ర్ లో హెల్త్ విషయంలో స్పెష‌ల్ కేర్ తీసుకోవ‌డం ఎంతో అవ‌స‌రం.

స‌మ్మ‌ర్ లో స‌హ‌జంగానే శరీరం వేడిని ఎక్కువగా నిల్వ చేసుకుంటుంది, కాబట్టి కొన్ని ఆహారాలను నివారించడం ఆరోగ్యానికి మంచిది.మ‌రి లేటెందుకు స‌మ్మ‌ర్ లో ఏయే ఫుడ్స్ జోలికి వెళ్ల‌కూడ‌దో తెలుసుకుందాం ప‌దండి.

సోడా, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ ( Soda, cold drinks, ice creams )స‌మ్మ‌ర్ సీజ‌న్ లో పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు దాదాపు అంద‌ర్నీ బాగా ఎట్రాక్ట్ చేస్తుంటారు.అయితే షుగ‌ర్ అధికంగా ఉంటే ఇటువంటి పానీయాలు మ‌రియు తీపి పదార్థాలు తాత్కాలికంగా శ‌రీరానికి చల్లగా అనిపించినా, తరువాత దాహాన్ని పెంచి డీహైడ్రేషన్‌కు దారి తీస్తాయి.

అందుకే సోడా, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ వైపు స‌మ్మ‌ర్ లో క‌న్నెత్తి కూడా చూడొచ్చు.

Telugu General, Tips, Diet, Foods, Foodsavoided-Telugu Health

పకోడీ, సమోసా, పూరీ, చికెన్ ఫ్రై ( Pakoda, Samosa, Puri, Chicken Fry )లాంటి డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కు వేస‌విలో ఎంత దూరంగా ఉండే అంత మేలు జ‌రుగుతుంది.ఎందుకంటే, ఈ ఫుడ్స్‌ శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి.జీర్ణక్రియ ప‌నితీరును దెబ్బ‌తీస్తాయి.

అలాగే ఎక్కువ ఉప్పు కలిగిన మ‌రియు ప్రాసెస్డ్ ఫుడ్స్ అన‌గా చిప్స్, పిజ్జా, బర్గర్, పాప్ కార్న్ లాంటి ఆహారాలను స‌మ్మ‌ర్ లో తీసుకుంటే శరీరంలో నీటి నిల్వ‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంది.ఒత్తిడి, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు తలెత్తుతాయి.

Telugu General, Tips, Diet, Foods, Foodsavoided-Telugu Health

స‌మ్మ‌ర్ లో టీ, కాఫీ వంటి పానీయాల‌ను చాలా త‌క్కువ‌గా తీసుకోవాలి.లేదంటే అవి బాడీని డీహైడ్రేట్ చేస్తాయి.స్పైసీ ఫుడ్స్‌, తీగజాతి కూరగాయలు మ‌రియు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను కూడా వేస‌విలో ఎవైడ్ చేయాలి.వీలైనంత వ‌ర‌కు తేలికపాటి, పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవాలి.

రాగి సంగటి, రాగి జావ‌, గోదుమ రొట్టె, పెరుగ‌న్నం, మొలకెత్తిన గింజలు, పచ్చి కూరగాయల సలాడ్, కీర‌దోస‌కాయ‌, నీటితో నిండి పండ్లు మ‌రియు కూర‌గాయ‌లు, తాటి ముంజులు, బాదం పాలు, కొబ్బ‌రి నీళ్లు, మ‌జ్జిగ వంటివి వేస‌విలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube