మాంసాహారం అంటే ఇష్టపడని వారు అస్సలు ఉండరు.అందులో ముఖ్యంగా చికెన్, మటన్ అంటే చాలామంది ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.
చాలామంది చికెన్, మటన్ అలవాటును బాగా చేసుకుంటారు.దీంతో ముక్క లేనిది ముద్ద దిగదనే వారు ఉంటారు.
అంతలా ప్రజలు ఇప్పట్లో మాంసాహారాన్ని ఇష్టపడుతున్నారు.అయితే రోజులతో సంబంధం లేకుండా ప్రతివారం ఇష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా నాన్ వెజ్ తినడానికి ఇష్టపడుతున్నారు.
అయితే నాన్ వెజ్ ఎంత తిన్నా, ఏమి తిన్నా కూడా ఒక విధానం ఉంటుంది.
అయితే ఏ సమయంలో తినాలి అన్నది, ఏం తినకూడదు అన్నది చాలా ముఖ్యం.మరీ ముఖ్యంగా చికెన్, మటన్ తిన్న తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలను ఎలాంటి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు.చికెన్, మటన్ తినే ముందు లేదా తిన్న తర్వాత గాని పాలు( Milk ) అస్సలు తాగకూడదు.
ఇలా తాగితే జీర్ణ సంబంధిత సమస్యలు( Digestive Problems )వచ్చే అవకాశం ఉంది.ఇక చాలామంది తిన్న తర్వాత టీ తాగుతూ ఉంటారు.చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత టీ తాగితే జీర్ణ సమస్యలతో పాటు గుండెల్లో మంట కూడా వస్తుంది.చికెన్, మటన్ రెండూ కూడా వేడి పదార్థాలే.
అందుకే వీటిని తిన్న తర్వాత తేనె( Honey ) అస్సలు తినకూడదు.ఎందుకంటే శరీరం వేడెక్కి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.అందుకే చికెన్, మటన్ తిన్న తర్వాత ఈ పదార్థాలు అస్సలు తినకూడదు.అందుకే ఈ విషయం పట్ల అప్రమత్తంగా ఉండి చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అందుకే చికెన్, మటన్ తిన్న తర్వాత ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా తిన్న కొన్ని గంటల తర్వాత తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.