న్యూస్ రౌండప్ టాప్ 20

1.జేపీఎస్ లను మేము చర్చలకు పిలవలేదు

ప్రభుత్వం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను చర్చలకు పిలిచినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు.ఈ ప్రచారంలో నిజం లేదని ఆయన తెలిపారు.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines Gold Rate J-TeluguStop.com

2.తీవ్ర తుఫానుగా మోచా

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు ఉదయం 5:30 గంటలకు అదే ప్రాంతంలో వాయుగుండం గా మారిందని, ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని, రెండు తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం కనిపిస్తుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Telugu Ambati Rambabu, Congress, Degree, Havey, Jagan, Pavan Kalyan, Pawan Kalya

3.ముగిసిన కేఆర్ఎంబి సమావేశం

కృష్ణాజిల్లాలో నీటి వాటాలను తేల్చుకుండానే కేఆర్ఎంబి సమావేశం ముగిసింది.

4.సీఎం జగన్ విశాఖ పర్యటన

Telugu Ambati Rambabu, Congress, Degree, Havey, Jagan, Pavan Kalyan, Pawan Kalya

వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ నేడు విశాఖలో పర్యటిస్తున్నారు.

5.భద్రాచలంలో గవర్నర్ పర్యటన

Telugu Ambati Rambabu, Congress, Degree, Havey, Jagan, Pavan Kalyan, Pawan Kalya

నేడు భద్రాచలంలో తెలంగాణ గవర్నర్ తమిళ సై( Tamilisai Soundararajan ) పర్యటిస్తున్నారు.గిరిజన సమ్మేళనంలో గవర్నర్ పాల్గొంటున్నారు.

6.నేడు దోస్త్ షెడ్యూల్ విడుదల

Telugu Ambati Rambabu, Congress, Degree, Havey, Jagan, Pavan Kalyan, Pawan Kalya

దోస్త్ ద్వారా తెలంగాణలో డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి షెడ్యూల్ విడుదల చేశారు.

7.సంగారెడ్డిలో బిజెపి నిరుద్యోగ మార్చ్

నేడు సంగారెడ్డిలో బిజెపి నిరుద్యోగ మార్చ్ నిర్వహించింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఈటెల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

8.పవన్ కళ్యాణ్ పర్యటన

Telugu Ambati Rambabu, Congress, Degree, Havey, Jagan, Pavan Kalyan, Pawan Kalya

నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పర్యటిస్తున్నారు.అకాల వర్షాలతో నష్టపోయిన రైతులతో పవన్  మాట్లాడనున్నారు.

9.నేడు రేపు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు

నేడు రేపు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికార్లు తెలిపారు.

10.ఐపీఎల్

Telugu Ambati Rambabu, Congress, Degree, Havey, Jagan, Pavan Kalyan, Pawan Kalya

నేడు రాత్రి 7:30 గంటలకు కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ జరగనుంది.

11.జనసేన పై అంబటి రాంబాబు విమర్శలు

Telugu Ambati Rambabu, Congress, Degree, Havey, Jagan, Pavan Kalyan, Pawan Kalya

రాజకీయాల్లో జనసేన కుట్రలు ఎలా ఉంటాయో ప్రజలు గమనించాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ) ప్రజలకు సూచించారు.

12.వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వర రెడ్డి ఈరోజు వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

13.వివేకానంద రెడ్డి హత్య కేసు

మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సిబిఐ కోర్టులో వాదనలు ముగిశాయి.ఈనెల 15న ఉత్తర్వులు ఇస్తామని కోర్టు ప్రకటించింది.

14.జగన్ మహా యజ్ఞం

రాజ్యాధికారం కోసం ఏపీ సీఎం జగన్ మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టారు.రేపటి నుంచి ఆరు రోజులు పాటు చండీ, రుద్ర, రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహా యజ్ఞం కొనసాగనుంది.

15.తిరుమల సమాచారం

Telugu Ambati Rambabu, Congress, Degree, Havey, Jagan, Pavan Kalyan, Pawan Kalya

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.నేడు శ్రీవారి సర్వదర్శనానికి 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

16.లోకేష్ విమర్శలు

విధ్వంసక పాలకుడు జగన్ వినాశక చర్యలకు ప్రత్యక్ష సాక్షి నందికొట్కూరు నియోజకవర్గం తంగెడంచ లో నిలిచిపోయిన జైన్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.

17.కోడి కత్తి కేసు

కోడి కత్తి కేసు విచారణ జూన్ 15 కు వాయిదా పడింది.ఈరోజు ఎన్ఐఏ కోర్టులో ఈ కేసు విచారణకు రాగా ఎన్ఐఏ తరపున లాయర్ హాజరు కాకపోవడంతో పాటు, వేసవి సెలవులు కారణంగా కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు.

18.ఏపీ ఆర్థిక పరిస్థితి సీఎం ప్రత్యేక కార్యదర్శి స్పందన

ఏపీ ఆర్థిక పరిస్థితి పై కావాలని కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరు కృష్ణ అన్నారు.

19.బిజెపి  ఛార్జి షీట్ పై స్పందన

బిజెపి చేపట్టిన చార్జిషీట్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.

20.ఈరోజు బంగారం ధరలు

Telugu Ambati Rambabu, Congress, Degree, Havey, Jagan, Pavan Kalyan, Pawan Kalya

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 56,950

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 62,130

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube