ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్( Sunrisers Hyderabad ) జట్టు ప్రత్యర్థి జట్లపై విరుచుకుపడుతుంది.తాజాగా లక్నో తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఎప్పటికీ మరిచిపోలేని ఓ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
లక్నోపై ఏకంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆప్స్ కు మరింత చేరువైంది.మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో( Lucknow ) నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 165 పరుగులు చేయగలిగింది.ఇక లక్ష్య చేతన మొదలుపెట్టిన హైదరాబాద్ జట్టు కేవలం 9.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.

ఇక మ్యాచ్ లో హైదరాబాద్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు హెడ్ 30 బంతులలో 89 పరుగులు చేసి నాట్ ఔట్ నిలవగా., మరోవైపు అభిషేక్ శర్మ ( Abhishek Sharma )28 బంతులలో 75 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.ఈ ఊచకోతలో అనేక రికార్డులు నమోదయ్యాయి ఇక వాటి వివరాలు ఒకసారి చూస్తే.

ఐపీఎల్ చరిత్రలో 160 కంటే స్కోరను అత్యంత వేగంగా చేదించడం ఇదే మొదటిసారి.అలాగే ఐపీఎల్ టోర్నీలో ( IPL tournament )ఒక్క మ్యాచ్లో మొదటి 10 ఓవర్లలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగాను మరోసారి హైదరాబాద్ స్థానం సంపాదించుకుంది.ఈ సీజన్లో రెండోసారి పవర్ ప్లే లో 100 కంటే ఎక్కువ పరుగులు సాధించిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది.
అలాగే ఒక ఐపీఎల్ సీజన్ లో అత్యధిక సిక్సులు బాదిన జట్టుగా సన్రైజర్స్ నిలిచింది.ప్రస్తుతం కేవలం 12 మ్యాచ్లలో 146 సిక్సర్ లను సాధించింది.ఇప్పటివరకు ఈ సీజన్లో అభిషేక్ శర్మ కొట్టిన 35 సిక్సులు టాప్.కేవలం 195 బంతుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు అభిషేక్.
అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన వ్యక్తిగా అభిషేక్ శర్మ రికార్డు ఎక్కాడు.అలాగే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక బంతులు మిగిలి ఉండగా 100 కంటే ఎక్కువ పరుగులు ఉన్న మ్యాచులలో విజయం సాధించిన జట్టుగా ఎస్ఆర్హెచ్ రికార్డు సృష్టించింది.
ఇక ఐపీఎల్ లో పవర్ ప్లే లో అత్యధిక సార్లు 50 కంటే ఎక్కువ స్కోరు చేసిన రెండు ఆటగాడిగా ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్ తర్వాత స్థానాన్ని సంపాదించాడు.