సూర్యాస్తమయం తర్వాత గోళ్లు ఎందుకు కత్తరించకూడదు?

సూర్యుడు అస్తమించే సమయంలో గోర్లు కొరకడం కానీ, కత్తిరంచడం కాని చేయకూడదని మన పెద్దలు తరచుగా చెప్తుంటారు.అయినప్పటికీ మనం వినకుండా అలాగే చేస్తుంటే… రెండు దెబ్బలు వేసైనా సరే మాన్పిస్తారు.

 What Is The Reason Behind Do Not Cut Nails In Night Time , Cut Nails , Night T-TeluguStop.com

అసలు సూర్యాస్తమయం అయ్యాక గోళ్లు ఎందుకు కత్తిరించకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వం విద్యుత్ దీపాలు లేనప్పుడు సూర్యాస్తమయం అవుతుందంటే చాలు ఇళ్లలో దీపాలు వెలిగించే వారు.

అయితే ఇప్పుడున్నంత వెలుతూరు ఏం లేకపోయేది.చీకట్లో అలా దీపాల వెలుగుల్లో గోళ్లు కత్తిరించడం వల్ల చేతికి గాయాలు అయ్యే ప్రమాదం ఉందని పెద్దలు అలా చెప్పేవాళ్లు.

మన పూర్వీకుల నుంచి అది అలాగే కొనసాగుతూ వస్తోంది కాబట్టి మనం అదే ఆచారమేమో అనుకుంటున్నాం.ఏది ఏమైనప్పటికీ… రాత్రి పూట గోర్లు కత్తిరించకపోవడమే మంచిది.

అలాగే గోర్లు కొరకకూడదని కూడా చెబుతుంటారు.గోర్లు కొరకడం వల్ల గోర్ల వద్ద ఉండే క్రిములు నోట్లోకి వెళ్లి లేని పోని అనారోగ్యాలను కొని తెస్తాయి.

అంతే కాకుండా గోళ్లు కొరకడం వల్ల చేతి వేళ్ల చివర్ల ఉండే చిగుళ్లు పాడై రక్తం వచ్చి నొప్పి పుడ్తుంటుంది.అందుకే గోళ్లు కొరక కూడదని చెబుతుంటారు.

మనం ఏదైనా చెప్తే వినమనే ఉద్దేశంతోనే మన పెద్దలు… వాటిని దేవుడికి ఆపాదించి చెప్పారు.అలా అయితేనైనా మనం భయంతో వాటిని పాటిస్తామని వారి నమ్మకం.

అందుకే పెద్దలు చెప్పినట్లుగా ఇకనైనా గోర్లు కొరకడం గాని.రాత్రి పూట కత్తిరించడం గానీ చేయకండి.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube