రాజమండ్రిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ఓ వైపు అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతుండగా.
మరోవైపు వికేంద్రీకరణకు మద్ధతుగా సభ నిర్వహిస్తున్నారు.పోటాపోటీ యాత్రలు, సభలతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
అమరావతి రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రకు బీజేపీ, జనసేన మద్ధతు తెలిపాయి.ఈ సందర్భంగా ఇరు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొంటున్నారు.
అదేవిధంగా ఆజాద్ చౌక్ వద్ద వైసీపీ వికేంద్రీకరణ మద్ధతు సభ ఏర్పాట్లు చేయడంతో పాటు చంద్రబాబుకు వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం రాజమండ్రిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.
అయితే పాదయాత్ర చేసే రైతులకు మద్ధతుగా వేసిన టెంట్లను పోలీసులు కూల్చివేశారు.దీంతో పోలీసుల తీరుపై పాదయాత్ర మద్ధతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.