భారీ ట్రోల్లింగ్ : ఎన్టీఆర్ చేస్తే పవన్ కళ్యాణ్ కూడా చేయాలా ?

సోషల్ మీడియా ఉధృతి విపరీతంగా ఉన్న రోజులు ఇవి.ఎవరు ఏం చేసినా ఇట్టే అందరికీ తెలిసిపోతుంది.

 Massive Trolling: If Ntr Does It, Should Pawan Kalyan Also Do It, Pawan Kalyan-TeluguStop.com

అంతేకాదు చిన్న తప్పు జరిగిందా ఇక అంతే.సోషల్ మీడియా చేతిలో బలవ్వాల్సిందే.

విపరీతమైన హైప్ క్రియేట్ చేయడం లేదా విపరీతమైన ట్రోల్ చేయడం సోషల్ మీడియాలో నెటిజెన్స్ కి బాగా అలవాటైపోయింది.అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.

పవన్ కళ్యాణ్ హీరోగా హరి శంకర్ దర్శకత్వంలో తేరి అనే సినిమాకు రీమేగా ఒక చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే.ఈ సినిమా ఇప్పటికే పోలీసోడు అనే పేరుతో తెలుగులో కూడా వచ్చింది.

అయినా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ అనే పేరు పెట్టి హరీష్ శంకర్ ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా ప్రకటించిన రోజు నుంచి ఈ చిత్రంపై అనేక విధాలుగా సోషల్ మీడియా నెగిటివ్ గా స్పందిస్తోంది.

ఇప్పటికే ప్రతి సినిమా కూడా రీమేక్ చిత్రాలు రావడం, పవన్ కళ్యాణ్ కెరియర్ మొత్తం రీమెక్స్ సినిమాలతో నిండిపోతుండడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మాకు రీమేక్ సినిమాలు వద్దు బాబోయ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ హరీష్ శంకర్ ని ఏకిపారేస్తున్నారు.

ఇక ఈ టైంలో ఇప్పుడు మరొక విషయం పవన్ కళ్యాణ్ తో పాటు హరీష్ శంకర్ కి నిద్ర పట్టకుండా చేస్తోంది.పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం హరి శంకర్ ఒక హీరోయిన్ గా శ్రీలీలను ఎంపిక చేశాడు.

Telugu Hari Shankar, Massive, Pawan Kalyan, Pawankalyan, Seileela, Sridevi, Sril

దాంతో మరో మారు పవన్ కళ్యాణ్ ని ఆటాడుకుంటున్నారు సోషల్ మీడియా.పవన్ కళ్యాణ్ కి శ్రీలీలకు దాదాపు 30 ఏళ్ల వయసు తేడా ఉంది.51 కోళ్ల పవన్ కళ్యాణ్ 21 ఏళ్ల శ్రిలీల తో సినిమా ఏంటి అంటూ చాలామంది యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.మరి కొంతమంది పవన్ కు మద్దతుగా గతంలో శ్రీదేవితో ఎన్టీఆర్ చేయలేదా, అక్కినేనితో కూడా శ్రీదేవి చేసింది కదా.పైగా వయసు పైబడిన శ్రీదేవితో నాగార్జున కూడా చేశాడు అంటూ పోస్టులు పెడుతున్నారు.ఇక బాలకృష్ణతో కూడా శ్రీ లీల ఒక సినిమా అనౌన్స్ చేసింది.

ఇలా ఎక్కువ వయసు తేడాతో సినిమాలు చేస్తుండడం ప్రస్తుతం సోషల్ మీడియా నెగటివ్ కామెంట్స్ కి కారణమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube