ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం, దంత సంరక్షణ లేకపోవడం, బ్యాక్టీరియా పేరుకు పోవడం, కాఫీ టీ కూల్ డ్రింక్స్ వంటి పానియాలను అధికంగా తీసుకోవడం, వృద్ధాప్యం పొగాకు ఉత్పత్తులను నమలడం తదితర కారణాల వల్ల దంతాలపై పసుపు రంగు మరకలు పడుతూ ఉంటాయి.ఇవి చూసేందుకు అసహ్యంగా కనిపించడమే కాదు తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తాయి.
దంతాలపై పసుపు మరకలు ఉండటం వల్ల ఇతరులతో మాట్లాడేందుకు, హాయిగా నవ్వేందుకు కూడా జంకుతుంటారు.
ఈ క్రమంలోనే ఆ మరకలను వదిలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
ఖరీదైన టూత్ పేస్ట్ ని వాడుతూ ఉంటారు.కొందరైతే దంతాలకు ఏవేవో ట్రీట్మెంట్స్ సైతం చేయించుకుంటారు.
కానీ ఇంట్లోనే చాలా సులభంగా మరియు వేగంగా దంతాలపై ఏర్పడిన పసుపు రంగు మరకలు వదిలించుకోవచ్చు.అందుకు ఇప్పుడు చెప్పబోయే రెమెడీ గ్రేట్ గా సహాయపడుతుంది.
మరి ఆ రెమెడీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్‌ను తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు వేసుకోవాలి.అలాగే అందులో పావు స్పూన్ సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ రెగ్యులర్ టూత్ పేస్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలపై అప్లై చేసి సున్నితంగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకోవాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రంగా దంతాలను మరియు నోటిని క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే కనుక చాలా వేగంగా దంతాలపై ఏర్పడ్డ పసుపు రంగు మరకలు మాయం అవుతాయి.
అదే సమయంలో దంతాలు తెల్లటి ముత్యాల మాదిరి అందంగా, ఆకర్షణీయంగా మెరుస్తాయి.కాబట్టి, తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.