టాలీవుడ్ లో పలువురు యంగ్ హీరోలు ఎంట్రీ ఇచ్చి తమ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు.ఆ తర్వాత క్రేజీ సినిమాలు చేస్తూ వచ్చారు.
ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకపోయినా.రంగుల ప్రపంచంలోకి అడుగు పెట్టి హీరోలుగా ఫ్రూవ్ చేసుకున్నారు.
టాప్ హీరోలు అవుతారు అనుకున్న సమయంలో నెమ్మదిగా అవకాశాలను కోల్పోతూ.తెరమరుగయ్యారు.ఊరించి ఉత్తది చేసిన తెలుగు యంగ్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
రమేశ్‌బాబు
సూపర్‌స్టార్ కృష్ణ కొడుకుగా సినిమాల్లోకి వచ్చినా.పలు చక్కటి సినిమాలు చేసి మంచి హీరోగా పేరు పొందాడు.సామ్రాట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు లాంటి సినిమాలతో జనాలను బాగా ఆకట్టుకున్నాడు.
తన తండ్రితో కలిసి ఎన్ కౌంటర్ సినిమా చేసి.ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యాడు.సినిమాల మీద ఇష్టం తగ్గడంతోనే తను ఇండస్ట్రీకి దూరం అయ్యాడు.
వడ్డే నవీన్
ఒకప్పుడు మంచి క్రేజ్ ఉన్న హీరో వడ్డే నవీన్.పెళ్లి లాంటి బ్లాక్‌బస్టర్ మూవీలో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు.ప్రియా ఓ ప్రియా, చాలా బాగుంది, మా ఆవిడ మీదొట్టు మీ ఆవిడ చాలా మంచిది, నా ఊపిరి సహా పలు సినిమాలు చేశాడు.ఆ తర్వాత నెమ్మదిగా తెర మీది నుంచి దూరం అయ్యాడు.
జె.డి.చక్రవర్తి
శివ మూవీలో నెగెటివ్ రోల్ చేసి అదరొట్టిన జేడీ చక్రవర్తి.ఆ తర్వాత పలు చక్కటి సినిమాల్లో నటించాడు.మనీ, గులాబీ, అనగనగా ఒకరోజు, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా సహా పలు సూపర్ హిట్ సినిమాలు చేశాడు.
ఆ తర్వాత సత్య సినిమాతో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు.కథల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఫేడౌట్ అయ్యాడు.
తరుణ్
చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి వచ్చిన తరుణ్.తన తొలి మూవీ మనసు మమత తోనే ఉత్తమ బాల నటుడిగా అవార్డు అందుకున్నాడు.2000 సంవత్సరంలో నువ్వే కావాలితో హీరోగా మారాడు.ఆ తర్వాత ప్రియమైన నీకు, నువ్వు లేక నేను లేను, నువ్వే నువ్వే సహా పలు హిట్ సినిమాలు చేశాడు.ఆ తర్వాత వరుస వివాదాలు, చేసిన సినిమాలు హిట్ కాకపోవడంతో వెండి తెరకు దూరం అయ్యాడు.
వేణు
వేణు కూడా పలు అద్భుత సినిమాలతో చక్కటి ఇమేజ్ తెచ్చుకున్నాడు.స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్, పెళ్లాం ఊరెళితే, ఖుషీ ఖుషీగా, గోపి గోపిక గోదావరి లాంటి హిట్ సినిమాలు చేశాడు.దమ్ము సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ బావగా కనిపించాడు.చివరిసారిగా రామాచారి సినిమా చేసి టాలీవుడ్ కు దూరం అయ్యాడు.
రాజా
ఆనంద్ సినిమాతో హీరోగా వచ్చిన రాజా ఆ తర్వాత ఆ నలుగురు, వెన్నెల సినిమాలతో ఆకట్టుకున్నాడు.ఆ తర్వాత తను చక్కటి సినిమాలను ఎంచుకోకపోవడంతో అపజయాలు పొంది అవకాశాలు రాలేదు.
తారకరత్న
2002లో హీరోగా పరిచయం అయిన తారకరత్న.వరుసగా 9 సినిమాలను అనౌన్స్ చేశాడు.వాటిలో కొన్ని మాత్రమే సెట్స్ మీదకు వెళ్లాయి.
అవికూడా అంతగా ఆడలేదు.ఆ తర్వాత నెమ్మదిగా ఆయన సినిమా పరిశ్రమకు దూరం అయ్యాడు.
వరుణ్ సందేశ్
వరుణ్ నటించిన తొలి రెండు చిత్రాలు హ్యాపీ డేస్, కొత్త బంగారులోకం మంచి విజయం అందుకున్నాయి.ఆ తర్వాత 20 సినిమాలు చేసినా మంచి పేరు రాలేదు.నెమ్మదిగా తెరమరుగయ్యాడు.
నారా రోహిత్
బాణం సినిమాతో హీరోగా పరిచయం అయిన రోహిత్.ఆ తర్వాత పలు చక్కటి సినిమాలు చేశాడు.కానీ ఆతర్వాత కథలు ఎంచుకోవడంలో విఫలం కావడంతో ఆయనకు అవకాశాలు చేజారి పోయాయి.
తనీష్
చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి వచ్చిన తనిష్.నచ్చావులే మూవీత హీరో అయ్యాడు.ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు.నెమ్మదిగా తనకు అవకాశాలు రావడం ఆగిపోయాయి.