ఇండస్ట్రీలో వెండితెరకు ఎంత క్రెజ్ ఉంటుందో బుల్లితెరకు కూడా అంతే క్రెజ్ ఉంది.బుల్లితెరపై ఎప్పటికప్పుడు కొత్త హీరోలు పరిచయం అవుతూనే ఉంటారు.
తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో టివి సీరియల్స్ కి డిమాండ్ ఉంది.వెండితెర నటులకు ధీటుగా బుల్లితెర నటులు విరాజిల్లుతున్నారు.
ఇక కొత్త సీరియల్స్ పుట్టుకొచ్చిన కొన్నిసార్లు పాత హీరోలతోనే సీరియల్ చూపిస్తూ ఉంటారు.
ఇక కొన్నిసార్లు మాత్రమే ఇండస్ట్రీకి కొత్త హీరోలు పరిచయం అవుతుంటారు.
ఇక పాత హీరోలైన కొత్త హీరోయిన్స్ కి అవకాశాలు ఇస్తుంటారు.అయితే బుల్లితెర హీరోలు సైతం వెండితెర హీరోలతో సమానంగా ప్రేక్షకులను మేపిస్తూ వారి నుండి ఆదరణ, అభిమానాన్ని సొంతం చేసుకుంటారు.
అయితే బుల్లితెర హీరోలు ఏ ప్రాంతం నుండి ఇండస్ట్రీకి వచ్చారో ఒక్కసారి చూద్దామా.అయితే జీ తెలుగు టివి నటుల ప్రాంతాలను పరిశీలిస్తే.
శ్రీరామ్ వెంకట్ ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో.ఆయన సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశారు.
ఆయన ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురం వాసి.ఇక చంద్రముఖి సీరియల్ తో ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు నిరుపమ్ పరిటాల.
ఆయన కార్తీక దీపం సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.నిరుపమ్ పరిటాల ఏపీలోని కృష్ణా జిల్లా విజయవాడ వాసి.
ఇక బుల్లితెర నటులు అర్జున్, ప్రియతమ్, రవికృష్ణ లు కూడా విజయవాడ వాసులే.సిద్ధార్ధ్ వర్మ,అమర్ దీప్ చౌదరి లు ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తులే.జై ధనుష్, పవన్ సాయి లు హైదరాబాద్ వాస్తవ్యులు.మధుబాబు తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి.విజె సన్నీ స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం.శివ కుమార్, నాగార్జున లు కేరళ కు చెందినవారు.
చందు గౌడ, అలాగే మధుసూదన్ లు కర్ణాటకలోని బెంగుళూరుకి చెందిన వ్యక్తులు.ఆకర్ష్, ముఖేష్ గౌడలు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తులు.
గోకుల్, నఖిల్ కూడా చెన్నై వాసులే.