శోభన్ బాబు సూట్ కేసులో ఆ రెండు ఫోటోలు.. ఎందుకో తెలుసా ?

Why Sobhan Babu Keep Those 2 Photos With Him Always, Sobhan Babu ,Akkineni, NTR, Mallishwari, Brief Case, Bollywood Hero Shashi Kapoor

శోభన్ బాబు.ఉప్పు శోభనా చలపతిరావుగా కృష్ణా జిల్లా చిన నందిగామలో రైతు కుటుంబంలో 1937లో జన్మించాడు శోభన్ బాబు.

 Why Sobhan Babu Keep Those 2 Photos With Him Always, Sobhan Babu ,akkineni, Ntr,-TeluguStop.com

చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే మహా పిచ్చి దాంతో ఎలాగైనా నటించాలనే కోరికతో కాలేజీ రోజుల్లో నాటకాల్లో ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాడు.ఎలాగోలా డిగ్రీ వరకు చదువుకొని, ఉదయం పూట కాలేజీలకు వెళుతూ మధ్యాహ్నం పూట సినిమా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవాడు అక్కినేని, ఎన్టీఆర్ ల సినిమాలు చూస్తూ వారిలా నటించాలని ఆరాటపడేవాడు.

శోభన్ బాబు తన జీవితంలో 22 సార్లు చూసిన సినిమా ఎన్టీఆర్ నటించిన మల్లీశ్వరి.మొదట ఎన్టీఆర్ దైవ బలం సినిమాలో చిన్న క్యారెక్టర్ సంపాదించాడు.అలా మొత్తానికి సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.అప్పటి నుంచి వెనతిరిగి చూసుకోవాల్సిన అవసరం శోభన్ బాబుకి రాలేదు.

ఎన్నో సినిమాల్లో నటించి మహిళ అభిమానుల ఆరాధ్య దైవంగా పిలవబడ్డాడు.ఆయన ఎంతో మంచి పొదుపు మనిషి అని అంటూ ఉంటారు ఇండస్ట్రీ లో చూసిన వాళ్లు.

ఒక డబ్బు విషయంలోనే కాదు అన్ని విషయాల్లో కూడా ఆయన మంచి పొదుపు మనిషి, తక్కువగా మాట్లాడేవాడు.అలాగే ఆహారం కూడా ఎంతో మితంగా తీసుకునేవారు.

Telugu Akkineni, Bollywoodshashi, Sobhan Babu-Telugu Stop Exclusive Top Stories

అందం ఉంటేనే మనల్ని జనాలు చూస్తారు అని బాగా నమ్మిన వ్యక్తి శోభన్ బాబు.ఆయనతో షూటింగ్ లో ఎప్పుడు ఒక బ్రీఫ్ కేసు ఉండేది.అది ఓపెన్ చేయగానే అందులో బాలీవుడ్ హీరో శశికపూర్ కి చెందిన రెండు ఫోటోలు కనిపిస్తూ ఉండేవి.ఒకటి సన్నగా ఉన్న శశికపూర్ ఫోటో అయితే మరొకటి లావైన తర్వాత తీసినా శశి కపూర్ ఫోటో.

రోజు ఆ ఫోటోలు చూస్తూ అలా మారకూడదు అని అనుకుంటూ ఉండేవాడట శోభన్ బాబు.అందుకే ఆయన ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకునేవారు.శశికపూర్ ని ఆదర్శంగా తీసుకొని చివరి వరకు కూడా తన దేహాన్ని మెయింటైన్ చేశారు శోభన్ బాబు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube