టాలీవుడ్ స్టార్స్ చెంప చెళ్లుమనిపించే ఆ సంఘటన గురించి మీకు తెలుసా ?

ఒక హీరో లేదా ఒక నటుడు స్టార్ అవ్వాలంటే మంచి సినిమాల్లో నటిస్తే చాలు.లెక్కలేనంత మంది అభిమానులు వస్తారు.

 Hidden Facts About R Narayana Murthy Details, R Narayana Murthy, People Star, R-TeluguStop.com

అలాగే అంతకుమించిన కమర్షియల్ సినిమాల్లో కూడా నటించొచ్చు.కానీ ప్రతి స్టార్ కూడా రియల్ హీరో కాలేడు.

రియల్ హీరో కావాలంటే దమ్ము ఉండాలి.సినిమాలకు, సినీ ప్రపంచానికి అతీతంగా ఒక స్టార్ మాత్రం కచ్చితంగా రియల్ హీరోనే.

మరి ఆ హీరో ఎవరు ? ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్లోని జింఖానా మైదానంలో కొన్ని సంవత్సరాల క్రితం వరద బాధితుల కోసం తన బ్యాట్ ను వేలం వేయాలని నిర్ణయించుకున్నాడు ఇండియన్ ప్రముఖ బ్యాట్స్మెన్.

ఆ వేలం డబ్బుతో వరద బాధితులకు సహాయం చేయాలని భావించాడు.అలాగే ఆ వేలంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి మహామహులంతా కూడా వచ్చారు.దాంతో అనుకున్నట్టుగానే వేలం పాట మొదలైంది సినిమా హీరోలంతా కూడా వేలం పాట పాడటం ప్రారంభించారు.కేవలం వెలల్లోనే పాట మొదలయ్యింది… అతి కష్టం మీద లక్ష రూపాయలు దాటింది.చివరికి 1.5 లక్షలకు వేలం పాట చేరుకుంది నిర్వాహకులలో తీవ్రమైన నిరాశ నెలకొంది.

టాలీవుడ్ స్టార్స్ అంతా కూర్చున్న కూడా వేలం పాటకి వరద బాధితుల కోసం రెండు లక్షల కూడా చెల్లించడానికి ముందుకు రాకపోవడం అందరిని నిరాశకు గురిచేసింది.

Telugu Bat, Flood Victims, Floods, Yana Murthy, Yanamurthy Bat-Movie

అంతలో తెల్లని పాయింటు, షర్టు వేసుకొని మాసిన గడ్డంతో, భుజాన ఒక సంచి వేసుకొని వచ్చాడు ఒక వ్యక్తి వచ్చాడు.వస్తూనే తన పాట 8,50,000 అంటూ గట్టిగా అరిచాడు.దాంతో అందరూ షాక్ అయ్యారు అగ్ర హీరోలు ఎవ్వరికి నోట మాట రాలేదు.

నిర్వాహకులు ఆనందంతో పాటని త్వరితగతిన ఫైనల్ చేశారు.అతడు తన వెంట తెచ్చుకున్న ఆ సంచిలోని డబ్బుని వారి ముందు టేబుల్ పైన కుప్పగా పోశాడు.

అలా ఆ బ్యాట్ తీసుకొని దాన్ని ముద్దు పెట్టుకుని నేరుగా ఒక అనాధ శరణాల శరణాలయానికి వెళ్లి ఆ బ్యాట్ ను ఇచ్చేశాడు.వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు.

ప్రస్తుతం నా దగ్గర ఇంతే డబ్బు ఉంది లేదంటే ఎక్కువే పాడే వాడిని అంటూ చెబుతూ నవ్వుతూ వెళ్ళిపోయారు.

Telugu Bat, Flood Victims, Floods, Yana Murthy, Yanamurthy Bat-Movie

అతను మరెవరో కాదు ఆర్ నారాయణమూర్తి. పీపుల్ స్టార్ అని అందరి చేత పిలవబడే నారాయణమూర్తి ఇప్పటికీ 25 సినిమాలకు పైగా హీరోగా నటించిన సొంత ఇల్లు కూడా లేదు.కేవలం ఒక చాప, దిండు మాత్రమే అతడి ఆస్తి.

సంపాదించి అంతా కూడా పేదల కోసమే ఖర్చు చేశాడు.పెళ్లి చేసుకుంటే ఎవరికి సేవ చేయలేనని భావించి బ్రహ్మచారిగా ఉండిపోయాడు.

అతడేమీ అందగాడు కాదు, ఆరడుగులు లేడు, కండలు తిరిగిన శరీరం కాదు, కానీ అతడు గొప్ప మనసున్న హీరో.అందుకే పీపుల్ స్టార్ అని పిలవబడ్డాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube