ఢిల్లీ లిక్కర్ కేసులో సంబంధాలు ఉన్నాయంటూ బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలను తన తండ్రి కేసీఆర్ ప్రశిస్తున్నారనే.ఓర్వలేకే ఇదంతా చేస్తున్నారన్నారు.బీజేపీపై పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్న ఆమె.సీబీఐ, ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు.
దేశ వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని కవిత విమర్శించారు.
విపక్ష నేతలపై ఇష్టానుసారం మాట్లాడటం, అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు.ఇలాంటివి చేస్తే కేసీఆర్ భయపడతారని అనుకుంటున్నారని భావిస్తున్నారు కానీ.
ఇదంతా వ్యర్థ ప్రయత్నమేనని పేర్కొన్నారు.తమ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు.







