ప్రముఖ దర్శకుడు తేజ దర్శకత్వంలో నితిన్, సదా జంటగా నటించిన సినిమా జయం.ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
అయితే తేజ 2001లో నువ్వు నేను మూవీ రిలీజ్ రోజున ఆడియన్స్ తో కల్సి హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో సినిమాను చూస్తున్నారు.ఇక విరామ సమయంలో 18ఏళ్ళ ఓ కుర్రాడు ని చూసిన తేజ ఫ్లాట్ అయ్యారంట.
అతడి దగ్గరికి వెళ్లి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా అని అడిగి ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళారంట.
అయితే తేజని అల్లు అరవింద్ కొడుకు అర్జున్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అడిగారంట.
ఇక అప్పటికే తేజ దగ్గర జయం సినిమా కథ ఉండటంతో అల్లు అర్జున్ తో ఓ షూట్ చేశారు.కాగా.ఈ క్యారెక్టర్ కి బన్నీ సూటవ్వడం లేదని, మరోసినిమా చూద్దామని తేజా చెప్పారంట.ఆ తరువాత తేజ నితిన్ కి ఫోన్ చేయడంతో వచ్చారంట.
ఇక నితిన్ ఫోటో షూట్ లో ఒకే అవడం,సుధాకర రెడ్డి కూడా ఒకే చెప్పడంతో ముంబయి నుంచి సదాను హీరోయిన్ గా సెలక్ట్ చేశారు.
అంతేకాదు.
ఈ సినిమాలో విలన్ ని కూడా ముంబయ్ నుంచి తీసుకున్నారంట.
ఇక సాంగ్స్ రికార్డ్ అయ్యాక 2002లో షూటింగ్ మొదలు పెట్టారు.అయితే రామానాయుడు స్టూడియోలో హీరోయిన్ హౌస్ సెట్ వేశారు.కాగా.
విలన్ యాక్టింగ్ సరిగ్గా రానందున ,వెంటనే గోపీచంద్ ని పిలిచారంట.ఈ సినిమాలో గోపిచంద్ హీరో పాత్ర అనుకోని వస్తే.
విలన్ పాత్ర ఇచ్చినట్లు గోపీచంద్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలో బండి బండి రైలు బండి సాంగ్ షూటింగ్ లో డాన్స్ మాస్టర్ శంకర్ ఒక డాన్సర్ ని కొట్టడం,అది అసోసియేషన్ చీలిక దాకా వెళ్లడం తర్వాత గొడవ సర్దుమణగడం జరిగాయంట.అంతేకాదు.ఒక సీన్ లో హీరోయిన్ సదా ఏడవడం సీన్ సరిగ్గా రాకపోతే తేజ ఆమె చెంప చెళ్లుమనిపించడంతో నిజంగానే ఏడ్చేయడంతో సీన్ బాగా వచ్చిందంట.
ఈ సినిమా అప్పట్లోనే 7కోట్ల షేర్ వసూలు చేసింది.