తెలుగు దర్శకులు హిందీ సినిమాలను రిజెక్ట్ చేయడం అన్నది ఇప్పుడు కొత్త ఏమీ కాదు.ఎందుకంటే గతంలో కూడా తెలుగు దర్శకులు హిందీ సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం చాలామంది యువ దర్శకులు తెలుగులో డైరెక్ట్ చేసిన సినిమాలను హిందీలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.కానీ సందీప్ రెడ్డి వంగా సంకల్ప్ రెడ్డి,క్రిష్ (Sandeep Reddy Vanga Sankalp Reddy, Krish)వంటి వారు డైరెక్ట్ హిందీ చిత్రాలను తీసిన సందర్భాలు ఉన్నాయి.
ఇప్పటికే టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని మొదటిసారి బాలీవుడ్ బాట పట్టాడు.
సన్నీ డియోల్ హీరోగా అతను తెరకెక్కించిన జాట్ మూవీ ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
అయితే జాట్ సినిమా గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన తెలుగు సినిమాకు రీమేక్ అంటూ వార్తలు వచ్చాయి కానీ అలాంటిదేమీ లేదని, ఇది డైరెక్ట్ హిందీ మూవీ అని మేకర్స్ స్పష్టం చేశారు.ఇకపోతే వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) వంటి బ్లాక్ బస్టర్ మూవీ ని తెరకెక్కించిన గోపీచంద్ మలినేని బాలయ్య బాబును (Balayya Babu)తాజాగా దర్శకత్వం వహించిన జాట్ మూవీ తెలుగు వర్షన్ లో నటించాలని కోరారట.

బాలకృష్ణ (Balakrishna) అంగీకరిస్తే హిందీలో సన్నీ డియోల్ తోనూ, తెలుగులో బాలకృష్ణ తోనూ ఆ పాత్ర చేయించాలని అనుకున్నాడట.అయితే ఇప్పటికే అఖండ 2(Akhand 2) చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన బాలకృష్ణ గోపీచంద్ (Akhand 2)ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట.గోపీచంద్ ప్రపోజల్ నచ్చి జాట్ సినిమాను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ప్రొడ్యూసర్స్(Mythri Movie Makers, People’s Media Producers) తమ వైపు నుండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.కానీ ఎప్పుడైతే బాలకృష్ణ నో చెప్పారో అప్పుడే ఈ సినిమాను హిందీలో మాత్రమే తీసి తెలుగులో డబ్ చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చేశారట.
అలా ఏప్రిల్ 10న జాట్ సినిమాను హిందీ తో పాటు తెలుగు, ఇతర ప్రధాన భాషల్లో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు గోపీచంద్ మలినేని.