నిద్ర‌లేమికి చెక్ పెట్టే ఉల్లి తొక్క‌లు.. ఇంత‌కీ ఎలా వాడాలంటే?

మనిషి ఆరోగ్యంగా జీవించాలి అంటే పోషకాహారం మాత్రం తీసుకుంటే సరిపోదు.కంటినిండా నిద్ర కూడా ఉండాలి.

 How To Get Rid Of Insomnia With Onion Peel Insomnia, Onion Peel, Onion Peel Heal-TeluguStop.com

అయితే ప్రస్తుత టెక్నాలజీ కాలంలో ఎంతో మంది నిద్ర సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు.రాత్రుళ్లు పడుకోవడం మానేసి ఫోన్లు, టీవీలతో సమయాన్ని వృధా చేస్తున్నారు.

క్రమంగా నిద్రలేమి బారిన పడుతున్నారు.నిద్రలేమి అత్యంత ప్రమాదకరమైనది.

దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఎన్నో జబ్బులను ఆహ్వానించినట్లే అవుతుంది.అందుకే నిద్రలేమి( Insomnia ) నుంచి బయటపడటం కోసం మందులు వాడుతుంటారు.

అయితే సహజంగా కూడా ఈ సమస్యను వదిలించుకోవచ్చు.అందుకు ఉల్లి తొక్కలు( Onion skins ) సహాయపడతాయి.ఉల్లి తొక్కలతో నిద్రలేమికి చెక్ పెట్టవచ్చు.అందుకోసం ఉల్లి తొక్కలను ఎలా తీసుకోవాలి.? అన్నది తెలుసుకుందాం పదండి.సాధారణంగా ఉల్లి తొక్కలు ఎందుకు పనికి రావని డస్ట్ బిన్ లోకి తోసేస్తుంటారు.

కానీ ఉల్లి తొక్కల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఈ తో పాటు యాంటీ ఆక్సిడెంట్స్‌( Antioxidants ) అధికంగా ఉంటాయి.అలాగే క్వెర్సెటిన్ అని పిలువబడే ఫ్లేవనాయిడ్లకు ఉల్లి తొక్క‌లు మంచి మూలం.

Telugu Sleep, Tips, Insomnia, Latest, Peel, Peel Benefits-Telugu Health

అందువల్ల ఉల్లి తొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ముఖ్యంగా నిద్రలేమితో బాధపడుతున్న వారికి ఉల్లి తొక్కలు గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.అందుకోసం ముందుగా ఒక కప్పు ఉల్లి తొక్కల‌ను తీసుకుని వాటర్ తో ఒకటి లేదా రెండు సార్లు వాష్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

Telugu Sleep, Tips, Insomnia, Latest, Peel, Peel Benefits-Telugu Health

వాటర్ హీట్ అవ్వగానే అందులో క‌డిగి పెట్టుకున్న ఉల్లిపాయ తొక్కలు వేసి కనీసం ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత ఆ వాటర్ ను ఫిల్టర్ చేసుకుని కొద్దిగా తేనె క‌లిపి సేవించాలి.రోజుకు ఒకసారి ఈ ఉల్లి తొక్కల వాట‌ర్ ను తీసుకుంటే నిద్రను ప్రేరేపించే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది.నిద్ర లేమి స‌మ‌స్య క్ర‌మంగా దూరం అవుతుంది.ప్రశాంతమైన, సుఖమైన నిద్ర మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube