మన హిందూ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ప్రతి రోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేసి భగవంతుడు ఆశీస్సులను పొందుతాము.అయితే ఇది దీపారాధన చేసేటప్పుడు నియమనిష్టలతో పూజ చేయాలని పండితులు చెబుతున్నారు.
కొందరు వారికి వీలున్నప్పుడు పూజలు చేయడం, అల్పాహారం తీసుకుని పూజ చేయడం వంటివి చేస్తుంటారు.ఈ విధంగా చేయటం వల్ల మనం చేసిన పూజకు ఏ విధమైనటువంటి ఫలితం ఉండదని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు.
మరి దీపారాధన చేసే సమయంలో ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా చాలా మంది మట్టి దీపం వెలిగించేటప్పుడు ఒకదానిపై ఒకటి మట్టి ప్రమిదలు పెట్టీ దీపారాధన చేస్తారు.ఇలా చేయడం మంచిది కాదు.
ఎందుకంటే దేవుడికి వెలిగించే దీపానికి రెండు వత్తులు వేసి పూజ చేయాలి.అలాగే కంచు దీపం వెలిగించే వారు వారానికి ఒకసారి మాత్రమే శుభ్రపరుస్తూ ఉంటారు.
ఇలా అస్సలు చేయకూడదు.కంచు దీపం వెలిగించే వారు ప్రతిరోజు దీపాలను శుభ్రపరచుకుని పూజ చేయాలి.
అలాగే మట్టి ప్రమిదలో దీపారాధన చేయటం వల్ల కొన్ని సార్లు దీపం నల్లగా మాడిపోతుంది.ఇలా మాడిపోయిన దీపాన్ని వెంటనే తొలగించాలి.
మనం ఏదైనా ప్రమిదను వెలిగించేటప్పుడు ఆ ప్రమిదకు బొట్లు పెట్టి అలంకరించాలి.

అదే విధంగా చాలామంది దీపం వెలిగించేటప్పుడు దీపం కింద ఏ విధమైనటువంటి ఆధారం లేకుండా వెలగిస్తుంటారు.ఇలా ఆధారంలేని దీపాన్ని వెలిగించకూడదు.దీపం కింద కొద్దిగా బియ్యం లేదా రావి ఆకులను లేదా పువ్వు రేకులను వేసి దీపారాధన చేయాలి.
ఉదయం దీపారాధన చేసిన తర్వాత ప్రమిదలో వాడిన ఒత్తులను తిరిగి సాయంత్రం వెలిగించకూడదు.ఇలా ప్రతిసారి దీపారాధన చేసినప్పుడు కొత్త వత్తులను వేసి దీపారాధన చేయటం ఎంతో శుభకరం.
ఇలా దీపారాధన చేసే సమయంలో ఈ విధమైనటువంటి నియమాలను పాటించడం వల్ల శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.