ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.08
సూర్యాస్తమయం: సాయంత్రం 06.09
రాహుకాలం:ఉ.10.00 మ12.00 వరకు
అమృత ఘడియలు:ఉ.9.15 ల10.15 సా.5.00 ల6.00 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 మ12.48 ల1.39 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటే వాయిదా వేసుకోవడమే మంచిది.తరచూ మారే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.చాలా సంతోషంగా ఉంటారు.
వృషభం:
ఈరోజు మీరు బంధువుల నుండి ఒక మంచి శుభవార్త వింటారు.అది మీ మనసులో ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.
మిథునం:
ఈరోజు మీరు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాలల్లో తలదూర్చకుండా ఉండడమే మంచిది.స్నేహితుల వలన ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.
కర్కాటకం:
ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఏ పని మొదలు పెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటమే మంచిది.
మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
సింహం:
ఈరోజు రాజకీయ నాయకులు కొన్ని దూరపు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.తోటి వారి సహాయం మీకు ఎప్పుడు ఉంటుంది.
కన్య:
ఈరోజు మీరు మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.
తులా:
ఈరోజు మీరు ఎప్పటి నుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన అంతా శుభమే జరుగుతుంది.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయట పడతారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
వృశ్చికం:
ఈరోజు మీకు ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడమే మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచనలు చేశారు.
ధనస్సు:
ఈరోజు మీరు సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.మీరు చేసే పనుల్లో కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.
మకరం:
ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.కొందరి ప్రవర్తన ఈరోజు మీ మనసులో బాధను కలిగిస్తుంది.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.
కుంభం:
ఈరోజు మీ కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.వ్యాపారస్తులు ఈరోజు మంచి లాభాలను అందుకుంటారు.బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
మీనం:
ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంత మంచి జరుగుతుంది.
DEVOTIONAL