ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్లు( Young Directors ) తమ దృష్టి మొత్తం సీనియర్ హీరోల పైనే పెట్టారు.టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, వెంకటేష్ లాంటి వాళ్ళతోనే ఈ యంగ్ డైరెక్టర్లు సినిమాలు చెయ్యడానికి ఇష్టపడుతున్నారనే వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
అయితే అలాంటి దర్శకులలో ముందుగా చెప్పుకోవాల్సిన దర్శకుడు బాబీ.( Director Bobby ) మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీశాడు డైరెక్టర్ బాబీ.

వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు బాబీ ఇప్పుడు నటసింహం నందమూరి బాలకృష్ణ ని( Nandamuri Balakrishna ) హీరోగా తీసుకొని తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించనున్నాడు.గతంలో కూడా బాబీ, వెంకటేష్‌తో ‘వెంకీ మామ’ సినిమా తీసాడు.ఇక రవితేజకి ‘పవర్’ లాంటి సినిమా అందించిన సంగతి తెలిసిందే.ఇలా దర్శకుడు బాబీ ఎక్కువగా సీనియర్ హీరోల పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి( Director Anil Ravipudi ) కూడా బాలయ్యతో ‘భగవంత్ కేసరి’( Bhagavanth Kesari ) సినిమాని రూపొందిస్తున్నాడు.ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి తీసే సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి.
ఈ రెండు సినిమాల కంటే ముందు అనిల్, వెంకటేష్ తో ‘ఎఫ్2’, రవితేజతో ‘రాజా ది గ్రేట్ ‘ సినిమాలు తీసాడు.

ఇక వీళ్ళిద్దరి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు మరో దర్శకుడు గోపీచంద్ మలినేని.( Director Gopichand Malineni ) బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ లాంటి సీనియర్ హీరోయిన్ లతో సినిమాలు తీసిన గోపీచంద్ మలినేని, మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఒక్కడితో సినిమా తీస్తే టాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరోలతో సినిమాలు తీసిన దర్శకుల గ్యాంగ్‌లో చేరిపోతారు.గోపీచంద్ మలినేని గతంలో వెంకటేష్ తో ‘బాడీగార్డ్ ‘, రవితేజతో చాలా సినిమాలు చేసాడు.
ఇక బాలయ్యతో ఇటీవల ‘వీర సింహారెడ్డి’ సినిమా తీసాడు.ఇలా మొత్తం మీద ఈ ముగ్గురు యంగ్ డైరెక్టర్లు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ లాంటి సీనియర్ హీరోలపైనే ఎక్కువగా కాన్సంట్రేట్ చెయ్యడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.