తెలుగు బుల్లితెరపై ఎంతో ప్రజాదారణ కలిగినటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమం ఒకటి.ఇప్పటికే ఈ కార్యక్రమం తెలుగులో ఎనిమిది సీజన్లు పూర్తిచేసుకుని తొమ్మిదవ సీజన్ ప్రారంభానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ఇక ఈ కార్యక్రమం మొదటి రెండవ సీజన్లకు ఎన్టీఆర్ నాని హోస్ట్ గా వ్యవహరించారు.అనంతరం నాగార్జున ( Nagarjuna ) వరుస సీజన్లకు హోస్ట్గా వ్యవహరిస్తూ ఉన్నారు.
ఇక ఇటీవల 8వ సీజన్ పూర్తయిన సంగతి తెలిసిందే అయితే ఈ కార్యక్రమం అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది ఇలా ఈ సీజన్ సక్సెస్ కాకపోవడానికి కారణం నాగార్జున అంటూ విమర్శలు కూడా వచ్చాయి.

నాగార్జున కంటెస్టెంట్ల తీరుపై పెద్దగా రియాక్ట్ అవ్వడం లేదని, కంటెస్టెంట్ లో హౌస్ లో ఏం చేసినా చూసి చూడనట్టు వదిలేస్తున్నారని విమర్శలు వచ్చాయి.ఇక నాగార్జున కనుక ఈ సీజన్ విషయంలో కాస్త సీరియస్ గా ఉండి ఉంటే 8 వ సీజన్ చాలా హైలైట్ అయ్యేదని కూడా అభిమానులు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 9( Bigg Boss 9 ) కార్యక్రమానికి హోస్ట్ గా నాగార్జున మారబోతున్నారంటూ వార్తలు వినిపించాయి ఈయన స్థానంలో విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) రాబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇలా బిగ్ బాస్ హోస్ట్ గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ సోనియా ఆకుల( Soniya Akula ) ఒక ఇంటర్వ్యూ సందర్భంగా హోస్ట్ నాగార్జున గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సీజన్ లో నాగార్జున గారి హోస్టింగ్ చాలా చెత్తగా ఉంది.నాకు మళ్ళీ బిగ్ బాస్ లోకి వెళ్లే అవకాశం వస్తే, నాగార్జున గారు ఉంటే అసలు వెళ్ళను.ఆయన ఉంటే చూసే ఆసక్తి కూడా పోతుందని తెలిపారు.
అతనిని తీసేసి రానా లేదా ఇతరులు ఎవరినైనా తీసుకుంటేనే బిగ్ బాస్ షో బ్రతుకుతుందని సోనియా తెలిపారు.నాగార్జున గారు గతంలో మాదిరిగా ఇప్పుడు లేరని, ఆయన చాలా సాఫ్ట్ అయ్యారని సోనియా తెలిపారు.
ప్రస్తుతం నాగార్జున గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.