భారత క్రికెట్ జట్టులో తనదైన ముద్ర వదిలిన బౌలర్ జహీర్ ఖాన్( Zaheer Khan ) పేరు ఇప్పటికీ అభిమానుల మనసుల్లో చెరిగిపోని గుర్తుగా నిలిచింది.భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించిన ఈ లెఫ్ట్-ఆర్మ్ పేసర్, తన బౌలింగ్‌తో ఎన్నో కీలక విజయాల్లో భాగమయ్యాడు.
క్రికెట్ ప్రియులు అతడిని ఎంతగానో అభిమానించేవారు.అయితే జహీర్ ఖాన్ ఆటను మాత్రమే కాదు.
అతని హుందాతనాన్ని, అందాన్ని కూడా ఎంతోమంది అభిమానించేవారు.ముఖ్యంగా మహిళా అభిమానులు( Lady Fans ) అతనిపై మోజుపడేవారు.
తాజాగా, జహీర్ ఖాన్‌పై ప్రేమను రెండు దశాబ్దాలుగా కొనసాగిస్తూ స్టేడియంలో తన అభిమానాన్ని వ్యక్తపరిచిన ఓ యువతి వీడియో నెట్టింట వైరల్( Viral ) అవుతోంది.
ఈరోజుల్లో సోషల్ మీడియా ద్వారా ఎవరి అభిమానాన్ని అయినా వ్యక్తపరచడం చాలా సులభం.
కానీ, 20 సంవత్సరాల క్రితం అలాంటి సదుపాయాలు లేవు.అప్పట్లో క్రికెటర్లపై అభిమానాన్ని, ప్రేమను వ్యక్తీకరించడానికి స్టేడియమే ఒకేఒక్క మార్గం.
కొందరు యువతులు తమ అభిమాన క్రికెటర్లను చూసేందుకు మైదానానికి వచ్చి, ఫ్లకార్డులపై “I Love You”, “Will You Marry Me?” అంటూ రాసి ప్రదర్శించేవారు.ఈ సందర్భాలు అప్పట్లో టెలివిజన్ స్క్రీన్‌లలో కనిపించేవి.
ఇవి ఒకప్పుడు సెన్సేషన్‌గా మారేవి.అయితే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ప్రభావంతో అలాంటి సంఘటనలు పెద్దగా హైలైట్ అవ్వడం లేదు.
ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంఘటన టీమిండియా మాజీ బౌలర్ జహీర్ ఖాన్‌కు సంబంధించినది.గతంలో జహీర్ ఖాన్ భారత జట్టులో ప్రధాన బౌలర్‌గా అదరగొట్టేవాడు.అతని ఆటతీరును చూసి యువతులు విపరీతంగా అభిమానించేవారు.అంతేకాదు, అతనిని ప్రత్యక్షంగా చూడడానికి స్టేడియాలకు వచ్చేవారు.అటువంటి వారిలో ఒక యువతి జహీర్ ఖాన్‌ను గాఢంగా అభిమానించేది.ఆమె మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వచ్చేది.
ప్రతి సారి “I Love You Zaheer Khan” అంటూ ఫ్లకార్డు పట్టుకుని స్టేడియంలో కనిపించేది.కానీ, జహీర్ అప్పట్లో ఇప్పటికే ఒక అమ్మాయితో ప్రేమలో ఉండడంతో ఈ యువతి అభిమానం కేవలం ఒక్కపక్కనే నిలిచిపోయింది.
అయినప్పటికీ, ఆమె తన ప్రేమను, అభిమానాన్ని తగ్గించుకోలేదు.
ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత అదే అభిమాని, అదే భావంతో జహీర్ ఖాన్‌ను కలిసింది.ప్రస్తుతం లక్నో జట్టుకు మెంటార్‌గా పనిచేస్తున్న జహీర్, ఇటీవల ఐపీఎల్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు.అదే సమయంలో తన అభిమానిని మళ్లీ కలుసుకున్నాడు.
ఆశ్చర్యకరంగా ఆ యువతి ఇప్పుడు కూడా “I Love You Zaheer Khan” అని రాసిన ఫ్లకార్డుతో స్టేడియానికి వచ్చింది.ఈ అనూహ్య సంఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది.
నిజమైన అభిమానానికి, ప్రేమకు కాలపరిమితి ఉండదని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.